Virat Kohli Viral Video: బృందావన్ ఆశ్రమంలో సందడి చేసిన విరాట్ ఫ్యామిలీ.. వైరల్ వీడియో
Virat Kohli, Anushka Sharma At Vrindavan: విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి బృందావన్ ఆశ్రమంలో సందడి చేశారు. భారత మాజీ కెప్టెన్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli Viral Video: శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భాగం కావడం లేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కుటుంబసభ్యులతో కలిసి బృందావన్ ఆశ్రమంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీతో పాటు భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక ఉన్నారు. విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి బృందావన్‌లో స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. విరాట్ కోహ్లీ బృందావన్‌లో భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి ఉన్న ఫోటో, వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
బృందావన్‌లో కుటుంబ సభ్యులతో విరాట్..
మీడియా నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి బృందావన్‌లోని బాబా నీమ్ కరోలి ఆశ్రమంలో సుమారు 1 గంట పాటు ఉన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కాటేజ్‌లో గడిపాడు. దీంతో పాటు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి కలిసి ఫోటోలు దిగారు.




సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Lovely Video of Virat Kohli with his Family ❤️❤️?#ViratKohli #KingKohli #INDvSL #arshdeep #arshdeepsingh #family #VamikaKohli #lovelytwt pic.twitter.com/sRA2GEK290
— Krishna Kumar | Digital Marketer | SMM | SEO (@digitalkrishna7) January 6, 2023
ఈ వైరల్ వీడియోలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బాబా నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ సమయంలో, కుమార్తె వామిక కూడా ఆమెతో ఉంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ చున్నీలో కనిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దాదాపు గంటసేపు ఆ ఆశ్రమంలో గడిపారు. కరోలి ఆశ్రమంలో దాదాపు గంటపాటు బస చేసిన అనంతరం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆనందమయి ఆశ్రమానికి బయలుదేరారు. కాగా, అనుష్క శర్మ కుటుంబం బాబా నీమ్ కరోలికి భక్తురాలు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
