Watch Video: హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన ప్లేయర్.. ఆ ఫార్మాట్‌లో తొలి బౌలర్‌గా రికార్డ్.. అదేంటంటే?
Geetika Kodali: రెండో ఓవర్‌లోనే తన ప్రత్యర్థి జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపి, మహిళల క్రికెట్‌లో సరికొత్త పేజీ లిఖించింది.
ప్రస్తుతం వెస్టిండీస్‌లో 60బంతుల టోర్నీ జరుగుతోంది. మహిళలు, పురుషుల విభాగంలో ఏకకాలంలో టోర్నీ నిర్వహిస్తున్నారు. టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. మహిళల టోర్నీ నుంచి ఈ హ్యాట్రిక్ వచ్చింది. అమెరికాకు చెందిన గీతిక కోడలి ఈ అద్భుతం చేసింది. సెయింట్ కిట్స్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ వర్సెస్ బార్బడోస్ రాయల్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అందులో ట్రిన్‌బాగో గెలిచింది. ఈ విజయానికి గీతిక ప్రధాన కారణంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. దీంతో బార్బడోస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 63 పరుగులు మాత్రమే చేసి 29 పరుగుల తేడాతో ఓడిపోయింది.
93 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ జట్టుకు శుభారంభం అవసరం. ఈ జట్టు తొలి ఓవర్‌లో 5 పరుగులు చేసింది. కానీ, రెండో ఓవర్‌లో గీతిక సత్తా చాటింది. రెండో ఓవర్ తొలి బంతికే గ్రిమ్మండ్ చేతిలో హేలీ మాథ్యూస్ క్యాచ్ అందుకుంది. కెప్టెన్ మాథ్యూస్ రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్రిట్నీ కూపర్‌ని గీతిక బోల్డ్‌గా కొట్టేసింది. వికెట్ కీపర్ కిసియా చేతిలో క్లో ట్రయాన్ స్టంపౌట్ అయింది. ఆమె ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ విధంగా గీతిక తన హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. ఈ టోర్నమెంట్‌లో మహిళల విభాగంలో హ్యాట్రిక్ సాధించిన మొదటి క్రీడాకారిణిగా నిలిచింది. చినెల్లే హెన్రీ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఆమె విజయవంతం కాలేదు. ఆమె 37 పరుగులు చేయగలిగింది. ఆమె ఇన్నింగ్స్‌లో 29 బంతులు ఎదుర్కొంది. ఇందులో 5 ఫోర్లతో పాటు ఒక సిక్స్ బాదేసింది. అలియా ఎలీన్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
Hat-trick for Kodali!!!!!! Geetika Kodali’s 3rd wicket in a row is the @officialskyexch play of the match. Her bowling helps the Knight Riders pick up their first win of the 6ixty. #CricketsPowerGame #6ixtyCricket #CPL22 pic.twitter.com/mJkg3xLvVX
— THE 6IXTY (@6ixtycricket) August 25, 2022
అంతకుముందు, తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చిన నైట్ రైడర్స్ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ డియాండ్రా డాటిన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఈ బ్యాటర్ జట్టు తరపున 46 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 34 బంతులు ఎదుర్కొంది. ఇందులో మూడు ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు బాదేసింది. రెండో ఓపెనర్ లీ ఆన్ కిర్బీ 16 పరుగులు చేసింది. సునే లూస్ 17 బంతుల్లో 25 పరుగులు చేసింది. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి.