AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్ స్నేహితుడికి సెలెక్టర్ పదవి లభిస్తుందా..? అతడెవరో కాదు మన ఇండియా బ్యాట్స్‌మెన్ రికార్డుల రారాజు..!

Sachin Friend Vinod Kambli : సచిన్ టెండూల్కర్ స్నేహితుడు, భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లీ జూనియర్ నేషనల్ సెలెక్టర్ పదవికి

సచిన్ స్నేహితుడికి సెలెక్టర్ పదవి లభిస్తుందా..? అతడెవరో కాదు మన ఇండియా బ్యాట్స్‌మెన్ రికార్డుల రారాజు..!
Vinod Kambli
uppula Raju
|

Updated on: Apr 27, 2021 | 5:27 PM

Share

Sachin Friend Vinod Kambli : సచిన్ టెండూల్కర్ స్నేహితుడు, భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లీ జూనియర్ నేషనల్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పోస్టుల నియామకాల కోసం ఏప్రిల్ 14 న బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. చివరి తేదీ ఏప్రిల్ 26గా నిర్ణయించింది. అయితే టీమ్ ఇండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ దీని గురించి మాట్లాడారు. ‘నేను ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నాను. ఎందుకంటే భారత క్రికెట్ నాకు చాలా ఇచ్చింది ఇప్పుడు ఏదో ఒకటి తిరిగి ఇవ్వడం నా వంతు. నా జట్టు, బెంచ్ బలాన్ని పెంచే పని చేయాలనుకుంటున్నాను. తద్వారా ప్రతిభావంతులైన ఆటగాళ్ల అన్వేషణలో నేను బీసీసీఐకి సాయం చేయగలనని’ అని చెప్పారు.

49 ఏళ్ల వినోద్ కాంబ్లి టెస్ట్ క్రికెట్‌లో నాలుగు సెంచరీలతో సహా 1084 పరుగులు చేశాడు. అదే సమయంలో వన్డేల్లో రెండు సెంచరీలు,14 హాఫ్ సెంచరీలతో 2477 పరుగులు చేశాడు. 129 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 59.67 సగటుతో 9965 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కాంబ్లీకి 35 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన వినోద్ కాంబ్లీ ముంబై క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఇంప్రూవ్‌మెంట్ కమిటీ సభ్యుడు కూడా.

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ వినోద్ కాంబ్లీకి ఒక ప్రత్యేకమైన రికార్డు ఉంది. తన పుట్టినరోజున వన్డే సెంచరీ చేసిన తొలి క్రికెటర్ కాంబ్లీ. అతని సగటు భారత టెస్ట్ క్రికెట్‌లో ఉత్తమమైనది. అతను సగటున 54 పరుగులు చేశాడు. అయితే అతను తన 23 వ ఏట భారతదేశం కోసం తన చివరి టెస్ట్ ఆడాడు. ఆ తరువాత కాంబ్లీ వన్డే క్రికెట్‌లో మాత్రమే కనిపించాడు. కాంబ్లీ తన 28 వ ఏట వన్డేల్లో తన చివరి మ్యాచ్ ఆడటం మరో విషయం.

కాంబ్లీ తన మూడో మ్యాచ్‌లో టెస్ట్ సెంచరీ సాధించాడు ఇది డబుల్ సెంచరీ. 1993 లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌పై 224 పరుగులు చేశాడు. జింబాబ్వేతో ఆడిన తరువాతి టెస్టులో 227 పరుగులు చేశాడు. తన తదుపరి సిరీస్‌లో కాంబ్లీ శ్రీలంకపై 125, 120 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌లలో మూడు వేర్వేరు దేశాలపై వరుసగా మూడు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ కాంబ్లీ…