IND VS NZ: కాన్పూర్ టెస్ట్‌లో గుట్కా నములుతూ కెమెరాకు చిక్కిన ప్రేక్షకుడు.. మీమ్స్‌తో రెచ్చిపోయిన నెటిజన్లు..
కాన్పూర్ వేదికగా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుండడంతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతినిచ్చారు.
కాన్పూర్ వేదికగా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుండడంతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతినిచ్చారు. దీంతో టీమిండియాను ప్రోత్సహించడానికి మొదటి రోజు క్రికెట్ అభిమానులు భారీగా హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ ప్రేక్షకుడు గుట్కా నములుతూ కెమెరా కళ్లకు చిక్కాడు. అప్పటికే సీట్లో కులాసాగా కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న అతను నోట్లో గుట్కా ఉందనే విషయం కూడా మర్చిపోయి చేతులు పైకెత్తి అందరికీ హాయ్ చెబుతాడు. ఇంతలో పక్కనున్న వారు అతనిని వారిస్తారు. 70 ఓవర్ల మధ్యలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెంటనే సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.
ఇక నెట్టింట్లో చురుగ్గా ఉండే టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్ వసీం జాఫర్ సైతం ఈ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకోవడంతో నెటిజన్లు కూడా తమ నోటికి పనిచెప్పారు. వివిధ రకాల మీమ్స్, జోక్‌లు, ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోయారు. ‘వెల్‌కమ్ టు ఉత్తర ప్రదేశ్’, ‘ఈ గ్రౌండ్ పేరు చెప్పడానికి అవుట్ ఫీల్డ్, స్టాండ్స్ ఫొటోలు అవసరం లేదు’, ‘ స్టేడియం నిండా పాన్ బహర్ హోర్డింగ్‌లు, ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అతడిని నిందించి ఏం ప్రయోజనముంది’, ‘అరేయ్..ఇక్కడ గుట్కా చాలా చౌక..నీకేమైనా తీసుకురావాలినా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. మరి నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
— ? (@smnch43) November 25, 2021
“Team man ko bahar karo be team se” pic.twitter.com/qd1WXoEOT6
— Shivani Shukla (@iShivani_Shukla) November 25, 2021
“Team man ko bahar karo be team se” pic.twitter.com/qd1WXoEOT6
— Shivani Shukla (@iShivani_Shukla) November 25, 2021
Kanpur mai match hoga to: pic.twitter.com/YKJImChfeN
— Shivam Kumar Gupta ✍️ (@shivamg381) November 25, 2021
Kanpur??.The city of Gutka lovers. https://t.co/qShc92SyLw
— पंडित कार्तिकेय त्रिपाठी ????? (@tripathi_krtiky) November 25, 2021
Also Read:
IND vs NZ: అయ్యర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన లక్ష్మణ్.. ఆటతో ఆకట్టుకున్నాడంటూ కితాబు..
IND vs NZ: బంతి అలా వస్తుందని అనుకోలేదు.. జేమీసన్ బౌలింగ్‌పై గిల్ స్పందన..