AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: బంతి అలా వస్తుందని అనుకోలేదు.. జేమీసన్ బౌలింగ్‎పై గిల్ స్పందన..

కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ బౌలర్లు ఇంత తొందరగా రివర్స్ స్వింగ్ సృష్టిస్తారని ఊహించలేదని భారత యువ ఓపెనర్ శుభ్‎మన్ గిల్ అన్నాడు. తను ఔటైన బంతిని అంచనా వేయలేకపోయానని చెప్పాడు...

IND vs NZ: బంతి అలా వస్తుందని అనుకోలేదు.. జేమీసన్ బౌలింగ్‎పై గిల్ స్పందన..
Gill
Srinivas Chekkilla
|

Updated on: Nov 25, 2021 | 7:30 PM

Share

కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ బౌలర్లు ఇంత తొందరగా రివర్స్ స్వింగ్ సృష్టిస్తారని ఊహించలేదని భారత యువ ఓపెనర్ శుభ్‎మన్ గిల్ అన్నాడు. తను ఔటైన బంతిని అంచనా వేయలేకపోయానని చెప్పాడు. గిల్ 93 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రెండో సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ చేతికి చిక్కిన ముగ్గురు బ్యాట్స్‌మెన్లలో గిల్ ఒకడు. ” ముఖ్యంగా లంచ్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బంతి రివర్స్ స్వింగ్ అవ్వడం ప్రారంభించింది. నేను ఔటైన బంతిని అంచనా వేయలేకపోయాను” అని గిల్ మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జామీసన్‌ బౌలింగ్‎ను గిల్ ప్రశంసించాడు. ఎనిమిదో ఓవర్‌లో గిల్ ఓపెనింగ్ పార్టనర్ మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేయడం ద్వారా జేమీసన్ న్యూజిలాండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం పుజారా, గిల్ 61 పరుగుల భాగస్వామ్యాన్ని జెమీసన్ విడగొట్టాడు. “ఈరోజు జేమీసన్ బాగా బౌలింగ్ చేశాడని నేను అనుకుంటున్నాను, ముఖ్యంగా అతను కొత్త బంతితో వేసిన మొదటి స్పెల్. అతను నాకు, మయాంక్ అగర్వాల్‌కి చాలా మంచి ఏరియాల్లో బౌలింగ్ చేశాడు. నేను లంచ్ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, ఆ ఓవర్ మొత్తం బంతి స్వింగ్ అవుతున్నట్లు ఉంది.” అని గిల్ అన్నాడు

” నేను నా రాష్ట్ర జట్టు, భారత్ A కోసం ఓపెనింగ్ చేశాను. నేను మిడిల్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేశాను. మీరు ఓపెనర్‌గా ఆడుతున్నప్పుడు లేదా మీరు మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఆడుతున్నప్పుడు కొంచెం ట్వీకింగ్ ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జడేజా 17వ టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా చేరుకున్నాడు. ఇది రేపు కొనసాగుతుందని ఆశిస్తున్నాము.” అని శుభ్‎మన్ చెప్పాడు .

Read Also.. IND vs NZ: రహానె షాట్ ఎంపికపై లక్ష్మణ్ స్పందన.. అలా ఎలా ఆడతావంటూ ప్రశ్న..

పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో
కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో