AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: 15 సిక్సర్లతో 34 ఏళ్ల వరల్డ్ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్ గడ్డపై వైభవ్ మాస్ సంభవం

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వరల్డ్ క్రికెట్‌లో తన పేరును లిఖించాడు. 34 ఏళ్ల అరుదైన రికార్డును బద్దలు కొట్టి.. ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లీష్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

IND Vs ENG: 15 సిక్సర్లతో 34 ఏళ్ల వరల్డ్ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్ గడ్డపై వైభవ్ మాస్ సంభవం
Vaibhav
Ravi Kiran
|

Updated on: Jul 17, 2025 | 6:47 PM

Share

14 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌ వేదికగా జరుగుతోన్న యూత్ టెస్ట్ సిరీస్‌లో తన సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే 1991లో చేసిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. యూత్ సిరీస్‌లో భాగంగా మొదట ఇంగ్లాండ్, భారత్ అండర్ 19 జట్ల మధ్య వన్డే సిరీస్ జరిగింది. దీనిని భారత్ అండర్ 19 జట్టు 3-2తో గెలుచుకుంది. ఇందులో వైభవ్ సూర్యవంశీ 143 పరుగుల తుఫాను ఇన్నింగ్స్‌ ఆడటమే కాదు.. సిరీస్ అంతటికి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. వన్డేలు పూర్తి కాగానే.. రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జూలై 11-15 మధ్య బెకెన్‌హామ్‌లో జరిగింది.ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఇందులో వైభవ్ సూర్యవంశీ 34 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి 15 సిక్సర్లతో మొత్తం 1497 పరుగులు చేశాయి. ఇదొక రికార్డు కాగా.. భారత్ అండర్ 19 రెండు ఇన్నింగ్స్‌లలోనూ 10 సిక్సర్లతో 748 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 5 సిక్సర్లతో 709 పరుగులు కొట్టింది. ఇక వైభవ్ 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 70 పరుగులు చేశాడు. కాగా, 1991లో చెల్మ్స్‌ఫోర్డ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో 1430 పరుగులు నమోదు కాగా.. ఆ రికార్డును భారత్, ఇంగ్లాండ్ అండర్ 19 జట్లు 1497 పరుగులు సాధించి 34 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అండర్ 19 జట్టు యూత్ టెస్ట్‌లలో అత్యధిక పరుగులు చేసి టాప్ 5 మ్యాచ్‌లలోని ప్రతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భాగం అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..