AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru Stampede: బెంగుళూరు తొక్కిసలాటకు విరాట్ కోహ్లీ వీడియో కారణమా? ప్రభుత్వ నివేదికలో ఆర్సీబీనే దోషి ?

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఆర్సీబీ అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిందని, విరాట్ కోహ్లీ వీడియో కూడా జనసమీకరణకు కారణమైందని పేర్కొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ సంబరాల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో పలువురు మరణించారు, అనేకమంది గాయపడ్డారు.

Bengaluru Stampede: బెంగుళూరు తొక్కిసలాటకు విరాట్ కోహ్లీ వీడియో కారణమా? ప్రభుత్వ నివేదికలో ఆర్సీబీనే దోషి ?
Bengaluru Stampede
Rakesh
|

Updated on: Jul 17, 2025 | 6:37 PM

Share

Bengaluru Stampede: బెంగళూరు నగరంలో ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవ సంబరాల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో పలువురు మరణించారు, అనేకమంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఏం జరిగింది, ఎవరు బాధ్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జూన్ 4న ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడానికి ముందుగా నగర పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొంది. వరుసగా ఈవెంట్లు నిర్వహించడం వల్ల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారని, 50 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనకు విరాట్ కోహ్లీ వైరల్ వీడియో కూడా కారణమని ప్రభుత్వం తన నివేదికలో ప్రస్తావించింది.

కర్ణాటక ప్రభుత్వం ఈ రోజు హైకోర్టులో ఈ నివేదికను సమర్పించింది. ఈ నివేదికను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఇలాంటి అభ్యర్థనకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని కోర్టు తిరస్కరించింది. కర్ణాటక ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం.. ఆర్సీబీ జట్టు జూన్ 3న ర్యాలీ నిర్వహించవచ్చని పోలీసులకు కేవలం సమాచారం ఇచ్చింది కానీ, అధికారికంగా అనుమతి తీసుకోలేదు. జనాలను అంచనా వేయడానికి, ట్రాఫిక్ నిర్వహణకు, ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండటానికి అవసరమైన ఏడు రోజుల ముందస్తు నోటీసు కూడా పోలీసులకు ఇవ్వలేదు.

ఆర్సీబీ గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అనే రెండు అవకాశాలు ఉన్నందున, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ జూన్ 3 సాయంత్రం 6:30 గంటలకు సమర్పించిన దరఖాస్తుకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పీఐ అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయబడలేదు. ఆర్సీబీ జూన్ 4న ఉదయం 7:01 గంటలకు సోషల్ మీడియాలో విదాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ ఉంటుందని, ప్రవేశం ఉచితమని ప్రకటించింది. ఈ పోస్ట్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా, నివేదికలో క్రికెటర్ విరాట్ కోహ్లీ వీడియోను ప్రస్తావిస్తూ, విరాట్ ఉదయం 8:55 గంటలకు లైవ్‌లోకి వచ్చి అభిమానులను వేడుకల్లో పాల్గొనాలని కోరారని పేర్కొంది. అయితే, ఆ తర్వాత ఆర్సీబీ విడుదల చేసిన పోస్ట్‌లో తక్కువ మందికి మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పింది.

చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ కేవలం 35 వేల మంది కాగా, ఆ రోజు మూడు లక్షల మందికి పైగా జనం వచ్చారు. ఎంట్రీ సిస్టమ్ పై కూడా గందరగోళం నెలకొందని, దీనివల్ల గుంపులో భయాందోళనలు రేకెత్తాయని నివేదిక తెలిపింది. స్టేడియం గేట్లు కూడా సమయానికి తెరవకపోవడంతో జనం కొన్ని తలుపులు పగలగొట్టారు. ఈ ప్రమాదం సమన్వయం లేకపోవడం, అలాగే ఆర్సీబీ, ఇతర నిర్వాహకులు నిబంధనలను పాటించకపోవడం వల్లే జరిగిందని కర్ణాటక ప్రభుత్వం తన నివేదికలో స్పష్టం చేసింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..