Vaibhav Suryavanshi : ఇప్పుడే కాదు.. కాస్త వెయిట్ చేయండి.. త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై అతను ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే, క్రికెట్ ప్రపంచానికి కొత్త యూనివర్స్ బాస్ దొరికాడా అన్నట్లుంది. కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లనే భయపెడుతున్న ఈ కుర్రాడిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

Vaibhav Suryavanshi : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఊహించని రేంజ్ లో విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. ఇందులో 7 భారీ సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ సరిగ్గా 300. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైభవ్ బద్ధలు కొడతాడని అందరూ భావించారు. కానీ, క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటవడంతో ఆ రికార్డు తృటిలో మిస్ అయింది. అయినప్పటికీ, ఆ చిన్న వయసులో అతను చూపించిన తెగింపుకు స్టేడియం మొత్తం ఫిదా అయిపోయింది.
వైభవ్ అవుటైన తర్వాత అతని కోచ్ మనీష్ ఓజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గేల్ రికార్డు మిస్ అవ్వడంపై స్పందిస్తూ.. “ఇప్పుడే తొందరపడకండి, కాస్త వెయిట్ చేయండి. ఆ సమయం త్వరలోనే వస్తుంది, అది కూడా ఈ ఐపీఎల్ 2026 సీజన్ లోనే చూస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఏ మ్యాచ్ లో అయినా సరే మొదట బ్యాటింగ్ చేస్తే, వైభవ్ విధ్వంసం మరో లెవల్ లో ఉంటుందని, క్రిస్ గేల్ సాధించిన అత్యున్నత స్కోరు 175 రన్స్ రికార్డును కూడా అతను బ్రేక్ చేస్తాడని కోచ్ జోస్యం చెప్పారు.
ఆర్సీబీపై ఆడిన ఈ వీరోచిత ఇన్నింగ్స్ తో వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతనే. అంతటితో ఆగకుండా, ఈ సీజన్ లో అత్యధిక సిక్సర్లు (18 సిక్సర్లు) బాదిన ప్లేయర్ గా, అత్యధిక స్ట్రైక్ రేట్ (266.66) కలిగిన బ్యాటర్ గా వైభవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఆట తీరు చూస్తుంటే రికార్డులన్నీ అతని పాదాక్రాంతం అయ్యేలా కనిపిస్తున్నాయి.
బీహార్ కు చెందిన ఈ 15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలం పాటలో రూ.1.10 కోట్లకు అమ్ముడుపోయినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు అతను చేస్తున్న పరుగుల వర్షం చూస్తుంటే, రాజస్థాన్ రాయల్స్ యజమాన్యం సరైన వజ్రాన్ని వెలికితీసిందని అర్థమవుతోంది. పవర్ ప్లే లో ఫీల్డర్ల తలలపై నుంచి బంతులను పంపించడంలో వైభవ్ ది ప్రత్యేక శైలి. రానున్న మ్యాచ్‌ల్లో వైభవ్ నుంచి సెంచరీ ఎప్పుడు వస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
