IND vs ENG: వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు.. అదేంటంటే?
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు సవాలు చేశాడు. ఈ క్రమంలో వైభవ్ అతనికి స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసలేంటి ఈ ఓపెన్ ఛాలెంజ్, ఈ ఐపీఎల్ సెన్సేషన్ ఎలాంటి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Vaibhav Suryavanshi vs Andrew Flintoff: భారత సీనియర్ జట్టుతోపాటు, భారత అండర్ 19 జట్టు కూడా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుతో 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత అండర్ 19 విజయం సాధించగా, ఇంగ్లాండ్ అండర్ 19 రెండవ మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో, భారత అండర్ 19 జట్టు స్టార్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌ను ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు అతనికి ఇచ్చాడు. రెండవ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మరో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ థామస్ ర్యూ అతనికి ఈ ఛాలెంజ్‌ను విసిరాడు.
ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు వైభవ్ సూర్యవంశీకి సవాల్..!
ఈ ఓపెన్ ఛాలెంజ్ అనేది మ్యాచ్ సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరగలేదు. వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి మాటల తూటాలు విసరలేదు. బదులుగా పరుగులు సాధించే విషయంలో ఈ సవాలు విసిరాడు. అంటే, ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్, అతని జట్టు సహచరుడు థామస్ ర్యూ పరుగుల రేసులో వైభవ్ సూర్యవంశీని సవాలు చేశారన్నమాట.
వైభవ్ సూర్యవంశీని అధిగమించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు..
5 వన్డేల సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. మొదటి 2 వన్డేల్లో అతను 93 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో, సిరీస్‌లో పరుగుల పరంగా వైభవ్ కంటే ముందు ఎవరూ లేరు. కానీ, రెండవ వన్డే ముగిసిన తర్వాత, రాకీ ఫ్లింటాఫ్, థామస్ ర్యు అతనిని అధిగమించడం విశేసం.
ఆండ్రూ ఫ్లింటాఫ్ 2 మ్యాచ్‌ల తర్వాత 95 పరుగులు చేశాడు. థామస్ ర్యు 2 మ్యాచ్‌లలో సెంచరీతో 136 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల కంటే వెనుకబడి ఉండడం సవాలుగా ఉంటుంది. కేవలం పరుగులు సాధించడంతోనే ఈ లిస్ట్‌లో ముందుకు రావాల్సి ఉంటుంది.
కోచ్ మాట విని వైభవ్ సూర్యవంశీ స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తాడా..
వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓజా టీవీ9 హిందీతో ప్రత్యేక సంభాషణలో తన కోరిక గురించి చెప్పుకొచ్చాడు. వైభవ్ ఇప్పుడు సిరీస్‌లోని మిగిలిన 3 మ్యాచ్‌లలో కనీసం 1 సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ సాధించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఇందుకోసం వైభవ్ ఏమి చేయాలో కూడా అతను చెప్పాడు? అతని ప్రకారం, వైభవ్ తాను ఆడుతున్న విధంగా ఆడాల్సి ఉంటుంది. వికెట్‌పై ఉండి మరిన్ని బంతులు ఆడటానికి ప్రయత్నించాలి. అతను ఇలా చేస్తే, తప్పకుండా సెంచీర వస్తుంది.
ఇంగ్లాండ్‌లో వైభవ్ సూర్యవంశీ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాల్సి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. అతను తన కోచ్ సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే, పరుగుల పరంగా అతను ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ, అతని సహచరుడు థామస్ ర్యూను వెనక్కునెట్టేస్తాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




