WTC Points Table: కివీస్‌పై ఇంగ్లండ్‌ క్వీన్‌స్వీప్‌.. WTC పాయింట్ల పట్టికలో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..

World Test Championship Points Table: ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(WTC) 2021-23లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. .

WTC Points Table: కివీస్‌పై ఇంగ్లండ్‌ క్వీన్‌స్వీప్‌.. WTC పాయింట్ల పట్టికలో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..
Team India

Edited By: Phani CH

Updated on: Jun 28, 2022 | 7:11 AM

World Test Championship  Points Table: ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(WTC) 2021-23లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తద్వారా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం బ్రిటిష్‌ జట్టు ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన డిఫెండింగ్‌ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ 8వ స్థానానికి దిగజారింది. కాగా ఈ ఇప్పటివరకు 4 సిరీస్‌లు ఆడిన ఇంగ్లండ్‌ 52 పాయింట్లతో 28.89 విన్నింగ్‌ పర్సంటేజ్‌ను సాధించింది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా నాలుగు సిరీస్‌లు ఆడి 28 పాయింట్లతో 25.93 విన్నింగ్‌ పర్సంటేజ్‌ను నమోదు చేసింది. ఇక ఈ ఈ జాబితాలో 75 విన్నింగ్‌ పర్సంటేజ్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. దక్షిణాఫ్రికా కా (71.43), టీమిండియా (58.33) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

కాగా2021-23 సీజన్‌లో ఓ జట్టు ఆడిన సిరీస్‌లు, గెలుపు, ఓటములు, డ్రాల సంఖ్య ఆధారంగా పాయింట్లను లెక్కిస్తారు. కాగా ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోన్న టీమిండియా తొలి రెండు స్థానాల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. త్వరలో ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే రీషెడ్యూల్డ్‌టెస్ట్‌ తర్వాత దీనిపై ఓ క్లారిటీ రానుంది. గతేడాది కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఫలితం తేలకుండా అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అప్పటికే 4 మ్యాచ్‌లు పూర్తికాగాటీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. జులై1న ఈ రీషెడ్యూల్‌ టెస్ట్‌ జరగనుంది. ఇక వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో శ్రీలంక ఉండగా..5,6 స్థానాల్లో పాక్‌, విండీస్‌ ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్‌ కోసం తలపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..