Asia Cup 2025 : సారీ ఫ్యాన్స్.. మేము గ్యారంటీ ఇవ్వలేం.. భారత్-పాక్ మ్యాచ్‌పై చేతులెత్తేసిన యూఏఈ బోర్డు
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలోని అబుదాబి, దుబాయ్‌లలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. అయితే, ఇది రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటేనే సాధ్యమవుతుంది. మొదట, సెప్టెంబర్ 14న లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది.

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలోని అబుదాబి, దుబాయ్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఏకంగా మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. అయితే, ఇది రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. ఆసియా కప్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి యూఏఈ క్రికెట్ బోర్డు ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది.
భారత్-పాక్ మధ్య 3 మ్యాచ్‌లు సాధ్యం
ఆసియా కప్ 2025లో మొదటిసారి భారత్, పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్‌లో సెప్టెంబర్ 14న తలపడతాయి. ఆ తర్వాత రెండు జట్లు సూపర్-4 రౌండ్‌లో సెప్టెంబర్ 21న మళ్లీ పోటీపడతాయి. ఒకవేళ రెండూ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, సెప్టెంబర్ 28న టైటిల్ కోసం మరోసారి తలపడే అవకాశం ఉంది. ఈ విధంగా ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరగడం సాధ్యమే.
100% గ్యారెంటీ ఇవ్వలేం
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (Emirates Cricket Board) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ మాట్లాడుతూ.. “టోర్నమెంట్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్ని బోర్డులు ఆసియా కప్‌లో పాల్గొనడానికి తమతమ ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకున్నాయి. అయినప్పటికీ, ఏ ఒక్కరూ 100 శాతం గ్యారెంటీ ఇవ్వలేరు. భారత జట్టు టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌తో ఆడుతుందని మేము ఆశిస్తున్నాం” అని అన్నాడు. “మాకు దీనిని బహిష్కరించమని ఎటువంటి బెదిరింపులు రాలేదు. అభిమానులు ఎల్లప్పుడూ క్రీడలను, రాజకీయాలను వేరుగా ఉంచుతారు. ఈసారి కూడా అదే జరుగుతుందని మేము ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు.
త్వరలోనే టికెట్ల అమ్మకాలు ప్రారంభం
టికెట్ల కోసం ఆన్‌లైన్ మోసాలకు గురికావద్దని సుభాన్ అహ్మద్ అభిమానులను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఒక టికెట్ ఏజెన్సీతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే సరైన ధరకు టికెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. దీనితో, టికెట్ల అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదని, టికెట్లు అమ్ముతున్నామని చెప్పే వారంతా ఫేక్ అని స్పష్టమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




