Cricket Captaincy : అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే ?
క్రికెట్‌లో కెప్టెన్సీ చేయడం అంత సులభమైన పని కాదు. ప్రతి మ్యాచ్‌లో వ్యూహాలు రచించడం, జట్టును ఎంపిక చేయడం మరియు ఒత్తిడిని ఎదుర్కోవడం కెప్టెన్ బాధ్యత. క్రికెట్ చరిత్రలో చాలా మంది కెప్టెన్లు తమ జట్లకు ఎక్కువ కాలం నాయకత్వం వహించి అద్భుతమైన రికార్డులను సృష్టించారు.

Cricket Captaincy : క్రికెట్ మైదానంలో కెప్టెన్‌గా వ్యవహరించడం అంత సులభం కాదు. ప్రతి మ్యాచ్‌లో వ్యూహాలు, జట్టు ఎంపిక, ఒత్తిడిని తట్టుకోవడం కెప్టెన్ బాధ్యత. క్రికెట్ చరిత్రలో చాలా మంది కెప్టెన్లు తమ జట్టును చాలా కాలం పాటు నడిపించి అద్భుతమైన రికార్డులు సృష్టించారు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహేంద్ర సింగ్ ధోని – భారత్
ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 2007 నుంచి 2018 మధ్య మొత్తం 332 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లలో ధోని సారథ్యంలో భారత్ 178 మ్యాచ్‌లలో విజయం సాధించగా, 120 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది, 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కెప్టెన్‌గా ధోని విజయ శాతం 53.61%. ధోని కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
2. రికీ పాంటింగ్ – ఆస్ట్రేలియా
రెండో స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. అతను 2002 నుంచి 2012 వరకు 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్‌గా పాంటింగ్ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. అతను 220 మ్యాచ్‌లలో గెలిచి, కేవలం 77 మ్యాచ్‌లలో ఓడిపోయాడు. అతని విజయ శాతం 67.9%. పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లను (2003, 2007) గెలుచుకుంది.
3. స్టీఫెన్ ఫ్లెమింగ్ – న్యూజిలాండ్
మూడో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నాడు. అతను తన వ్యూహాత్మక ఆలోచనలకు ప్రసిద్ధి చెందాడు. ఫ్లెమింగ్ తన కెరీర్‌లో మొత్తం 303 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వాటిలో 128 మ్యాచ్‌లలో గెలిచి, 135 మ్యాచ్‌లలో ఓడిపోయాడు. అతని విజయ శాతం కేవలం 42.24% మాత్రమే అయినప్పటికీ, తన హయాంలో న్యూజిలాండ్ జట్టును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
4. గ్రేమ్ స్మిత్ – సౌత్ ఆఫ్రికా
సౌత్ ఆఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను తన కెరీర్‌లో మొత్తం 286 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్మిత్ సారథ్యంలో సౌత్ ఆఫ్రికా 163 మ్యాచ్‌లలో విజయం సాధించి, 89 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. టెస్ట్ క్రికెట్‌లో తన జట్టును ప్రపంచంలోని అత్యంత బలమైన జట్లలో ఒకటిగా నిలబెట్టడం అతని కెప్టెన్సీలో ప్రధాన విశేషం. అతని విజయ శాతం 56.99%.
5. అలెన్ బోర్డర్ – ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను 1984 నుంచి 1994 వరకు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో అతను 271 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. వాటిలో 139 మ్యాచ్‌లలో విజయం సాధించగా, 89 మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యాడు. అతని విజయ శాతం 51.29%.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




