Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ సెలక్ట్ కాకపోవడానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన అజిత్ అగార్కర్
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై ప్రశ్నలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ విషయంపై సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు.

Shreyas Iyer : ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత..”శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?” అని అజిత్ అగార్కర్‌ను ప్రశ్నించగా ఇది అతని తప్పు కాదు, మా తప్పు కూడా కాదు. అతనికి అవకాశం దక్కకపోవడం దురదృష్టం మాత్రమే అని సమాధానమిచ్చారు.
శ్రేయస్ అయ్యర్‌ను సెలక్ట్ చేయాలంటే, ఎవరిని తప్పించాలనే ప్రశ్న వస్తుంది. మేము 15 మంది సభ్యులను మాత్రమే సెలక్ట్ చేయగలం. అందుకే శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కలేదు. ఇందులో అతని తప్పేమీ లేదు. ప్రస్తుతానికి అతను తన అవకాశం కోసం వేచి ఉండాలని అగార్కర్ అన్నారు.
అంటే, శ్రేయస్ అయ్యర్ టాప్-5లో ఆడే బ్యాటర్. కానీ, టీమిండియాలో మూడో స్థానంలో తిలక్ వర్మ ఉంటాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉంటారు. ఫినిషర్‌ల పాత్ర కోసం రింకూ సింగ్, శివమ్ దూబే మధ్య పోటీ ఉంది. అంటే, 7 స్థానాలు ఇప్పటికే ఖాయం కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కలేదని అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.
ఈ సమయంలో తిలక్ వర్మకు బదులుగా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసి ఉండొచ్చు కదా అని కొందరు ప్రశ్నించారు. కానీ, ఈ ప్రశ్నకు సౌత్ ఆఫ్రికాపై తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్‌లే సమాధానం. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్, వరుసగా రెండు సెంచరీలు చేసి మొత్తం 280 పరుగులు సాధించాడు. అందుకే, శ్రేయస్ అయ్యర్‌కు బదులుగా తిలక్ వర్మను మూడో స్థానంలో పరిగణించారు. మిగిలిన స్థానాలు కూడా నిండిపోవడంతో శ్రేయస్ అయ్యర్‌కు నిరాశ ఎదురైంది.
ఆసియా కప్ కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా
రిజర్వ్ ప్లేయర్స్
ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




