AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!

Tilak Varma Stumping Controversy: సాంకేతిక ఆధారాలతో అంపైర్ నిర్ణయం సరైనదేనని తేలినప్పటికీ, ఇంగ్లాండ్ కీపర్ బట్లర్ చాకచక్యం భారత్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఘోర ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లగా, ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉన్న టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ల్లోనైనా పరువు నిలబెట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Video: ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!
Tilak Varma Controversy Stumping Dismissal
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 8:07 AM

Share

Tilak Varma Stumping Controversy: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అవుటైన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఈ వివాదం కాస్తా పెద్దదిగా మారింది.

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అవుటైన విధానం సరికొత్త వివాదానికి దారితీసింది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన స్టంపింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో అంపైర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మైదానంలో అసలేం జరిగిందంటే?

భారత జట్టు కేవలం పవర్‌ప్లే లోనే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ వేసిన ఒక వేగవంతమైన బంతిని భారీ షాట్ ఆడటానికి తిలక్ క్రీజు వదిలి ముందుకు వచ్చారు. అయితే బంతి వేగాన్ని అంచనా వేయడంలో విఫలం కావడంతో అది బ్యాట్‌కు దొరకకుండా నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లోకి వెళ్ళింది. తిలక్ క్రీజు వెలుపల ఉండటాన్ని గమనించిన బట్లర్ వెంటనే వికెట్లను పడగొట్టాడు.

ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..!

అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకుంది. బట్లర్ వికెట్లను పడగొట్టిన మరుక్షణమే బంతి అతని గ్లోవ్స్ నుంచి జారి కిందపడిపోయింది. దీంతో తిలక్ వర్మ నాటౌట్ అంటూ నెటిజన్లు రచ్చ చేయడం ప్రారంభించారు. కానీ రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ మాత్రం తిలక్‌ను అవుట్‌గా ప్రకటించారు. కేవలం 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి వైస్ కెప్టెన్ నిరాశగా వెనుతిరిగారు.

ఐసీసీ, ఎంసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఈ వివాదంపై స్పష్టత రావాలంటే క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ (MCC Law) నిబంధనలను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నియమం ప్రకారం:

ఒక వికెట్‌ను పడగొట్టే సమయంలో ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ బంతిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి.

వికెట్లను పడగొట్టే ఆ ‘ఖచ్చితమైన క్షణంలో’ బంతి కీపర్ చేతికి లేదా గ్లోవ్స్‌కు తగులుతూ ఉంటే ఆ అవుట్ పూర్తిగా చెల్లుతుంది.

వికెట్లు పడిపోయిన తర్వాత (బైల్స్ గాల్లోకి లేచిన తర్వాత) బంతి చేతిలోంచి జారినా సరే, అది అవుట్‌గానే పరిగణించబడుతుంది.

తిలక్ వర్మ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. జోస్ బట్లర్ వికెట్లను తాకే సమయానికి బంతి అతని వేలికొనలకు తగులుతూనే ఉంది. వికెట్లు పూర్తిగా పడిపోయిన తర్వాతే బంతి కిందపడింది. ఆ సమయంలో తిలక్ అడుగు క్రీజు బయటే ఉంది కాబట్టి అంపైర్ ఇచ్చిన నిర్ణయం నూటికి నూరు పాళ్ళు సరైనదే.

ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!

భారత్ ఘోర పరాజయం..

తిలక్ వర్మ వికెట్ పడటంతో భారత జట్టు గెలుపు ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆ తర్వాత కనీసం పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది. హర్షిత్ రాణా, శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేవలం 5 ఓవర్ల వ్యవధిలోనే భారత్ 52/5 నుంచి 70/9 కి పడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జొఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి, 125 పరుగుల ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..
అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం..350 ఏళ్లుగా ఇదే తంతు
ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం..350 ఏళ్లుగా ఇదే తంతు
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర