T20 Cricket: ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు.. టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు కెప్టెన్లు.. లిస్టు చూస్తే పరేషానే
ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు టీ20లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిలో కొందరు ఆటగాళ్లు కెప్టెన్లుగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ ఆటగాళ్లు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు విజయాన్ని అందించారు. టీ20 మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అభిమానులకు టీ20 క్రికెట్ అంటే చాలా ఇష్టం. తక్కువ సమయంలో అభిమానులకు పూర్తి వినోదం లభించడమే అందుకు కారణం. ఫాస్ట్ క్రికెట్‌గా పేరుగాంచిన ఈ ఫార్మాట్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఇదే. ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్స్ ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తుంటారు.
ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు టీ20లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిలో కొందరు ఆటగాళ్లు కెప్టెన్లుగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ ఆటగాళ్లు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు విజయాన్ని అందించారు. టీ20 మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
3. షేన్ వాట్సన్, 124* vs భారతదేశం..
ఆస్ట్రేలియా మాజీ వెటరన్ షేన్ వాట్సన్ 31 జనవరి 2016న సిడ్నీలో భారత్‌పై అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో వాట్సన్ 71 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 124 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది.
తొలుత ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అయితే భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. రోహిత్ శర్మ 38 బంతుల్లో 52, శిఖర్ ధావన్ 9 బంతుల్లో 26, విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 50, సురేశ్ రైనా 49 నాటౌట్‌గా రాణించారు.
2. షహర్యార్ బట్, 125 vs చెక్ రిపబ్లిక్..
ఈ జాబితాలో చెక్ రిపబ్లిక్‌పై అద్భుత సెంచరీ చేసిన బెల్జియం కెప్టెన్ షహర్యార్ బట్ రెండో స్థానంలో ఉన్నాడు. 29 ఆగస్టు 2020న జరిగిన ఈ మ్యాచ్‌లో, చెక్ రిపబ్లిక్‌పై షహర్యార్ బట్ కేవలం 50 బంతుల్లో 11 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 125 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెల్జియం 197 పరుగులు చేసి చెక్ రిపబ్లిక్‌ను 151 పరుగులకు పరిమితం చేయడం ద్వారా తిరుగులేని విజయాన్ని సాధించింది.
1. ఆరోన్ ఫించ్, 172 vs జింబాబ్వే..
ఆస్ట్రేలియన్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతను 3 జులై 2018న హరారేలో జింబాబ్వేపై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్ 76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 172 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..