
టీ20 ప్రపంచకప్ 2024 కోసం అమెరికా, వెస్టిండీస్ సన్నద్దమవుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇక టీ20 ప్రపంచకప్‌కు ముందు రెండు నెలల పాటు ఐపీఎల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన కొందరు భారత ఆటగాళ్లకు.. అలాగే విదేశీ ప్లేయర్లకు వారివారి టీ20 ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కింది. అయితే ఈ ఐదుగురు క్రికెటర్లు ఐపీఎల్‌లో అదిరిపోయే ప్రదర్శన కనబరిచినా.. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. వారెవరో తెలుసుకుందామా..
హర్షల్ పటేల్:
పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఈ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టడంతో పాటు పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్ 24 వికెట్లు తీశాడు. ఇంత అద్భుత ప్రదర్శన కనబరిచినా.. అతడికి భారత జట్టులో నో ఎంట్రీ.
ఇది చదవండి: కసి తీర్చుకుంటున్న కావ్య మారన్.. మెగా వేలంలోకి కమిన్స్‌తో పాటు ఆ ఇద్దరూ.. రిటైన్ లిస్టు ఇదే!
రుతురాజ్ గైక్వాడ్:
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కూడా. రుతురాజ్ 14 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ కూడా ఉంది. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
వీరిద్దరితో పాటు కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మంచి ప్రదర్శన కనబరిచారు. అలాగే శుభ్‌మాన్ గిల్ కూడా పరుగులు రాబట్టినా.. కేవలం రిజర్వ్ ప్లేయర్‌గానే టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, రియాన్ పరాగ్, నటరాజన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్‌కి కూడా టీ20 ప్రపంచకప్‌లో నో ఎంట్రీ. అటు విదేశీ ఆటగాళ్లలో రైలీ రోసేవ్, సునీల్ నరైన్, డుప్లెసిస్ లాంటి ప్లేయర్స్ కూడా టీ20 ప్రపంచకప్ జట్టులో లేకపోవడం గమనార్హం.
ఇది చదవండి: కోట్లు ఖర్చయినా పర్లేదు.. మెగా వేలంలోకి రోహిత్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్.! ఈసారి మోత మోగాల్సిందే..
మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..