- Telugu News Sports News Cricket news These 4 batters Not even a single six in ODI career Team India player in the list check odi records and stats
ODI Records: వీళ్లేం బ్యాటర్లు బ్రో.. వన్డే కెరీర్‌లో ఒక్క సిక్స్ కూడా బాదలే.. లిస్టులో టీమిండియా ప్లేయర్..
వన్డే ఫార్మాట్‌లో తుఫాన్ బ్యాటింగ్‌తో పేరొందిన బ్యాట్స్‌మెన్స్ ఎందరో ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో భారీ సిక్సర్లు బాదిన వారు కూడా ఉన్నారు. అయితే తమ వన్డే కెరీర్‌లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన ఆటగాళ్లు కూడా ఉన్నారు.
Updated on: Feb 21, 2023 | 5:23 AM

వన్డే క్రికెట్‌లోని అత్యంత ఆసక్తికరమైన ఫార్మాట్‌లలో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఈ ఫార్మాట్‌లో ఎన్నో రికార్డులు క్రియోట్ అవుతుంటాయి. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్స్ ఆడేందుకు ఇష్టపడుతుంటారు. వన్డే ఫార్మాట్‌లో తుఫాన్ బ్యాటింగ్‌తో పేరొందిన బ్యాట్స్‌మెన్స్ ఎందరో ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో భారీ సిక్సర్లు బాదిన వారు కూడా ఉన్నారు. అయితే తమ వన్డే కెరీర్‌లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ లిస్టులో నలుగురు ఆటగాళ్లు తమ కెరీర్‌లో ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండానే కెరీర్‌ను ముగించారు.

భారత జట్టులోని ప్రముఖ ఆల్ రౌండర్లలో, భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భారత్ తరపున 130 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో అతను 24.1 సగటుతో 1858 పరుగులు చేశాడు. అతను తన కెరీర్‌లో 2 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ప్రభాకర్ తన కెరీర్‌లో 157 ఫోర్లు కొట్టాడు. అతను తన వన్డే కెరీర్‌లో ఎప్పుడూ సిక్సర్ కొట్టలేకపోయాడు.

శ్రీలంక టెస్ట్ జట్టుకు బిగ్ మ్యాచ్ విన్నర్‌గా పేరుగాంచిన థిలాన్ సమరవీరకు ప్రత్యేకంగా వన్డే క్రికెట్‌లో మాత్రం పేరు అంతగా లేదు. అతను తన దేశం తరపున 53 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో సమరవీర 27.8 సగటుతో 862 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో 2 సెంచరీలు సాధించాడు. సమరవీర వన్డేలో 76 ఫోర్లు బాదినా ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు.

ఆస్ట్రేలియా మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కల్లమ్ ఫెర్గూసన్ తన అద్భుతమైన టెక్నిక్‌కు పేరుగాంచాడు. తన వన్డే కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను 41.4 సగటుతో 663 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. ఫెర్గూసన్ తన కెరీర్‌లో 64 ఫోర్లు కొట్టాడు. అయితే అతను ఏ జట్టుపైనా వన్డేల్లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.

జింబాబ్వే ప్లేయర్ డియోన్ ఇబ్రహీం కూడా తన వన్డే కెరీర్‌లో ఎప్పుడూ సిక్సర్ కొట్టలేదు. ఈ ఆటగాడు 82 వన్డేలు ఆడాడు. తన కెరీర్‌లో 29 టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డే క్రికెట్‌లో అతనికి ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో పది అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ, ఒక్కసారి కూడా బంతిని సిక్స్ పంపలేదు. కెరీర్‌లో సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు సాధించిన ఈ ఆటగాడు రెండు ఫార్మాట్‌లలో కూడా సిక్సర్ కొట్టలేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందికదా.




