AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Srilanka: శిఖర్ టీం ద్వితీయశ్రేణిది కాదు.. శ్రీలంకకు పంపినందుకు సంతోషించాలి: పాక్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా

శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ సారథ్యంలోని జట్టుపై ఆ దేశ మాజీ ఆటగాడు అర్జున రణతుంగ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియాను ద్వితీయ శ్రేణి జట్టు అని, శ్రీలంకకు అలాంటి జట్టును పంపి అవమానించారని పేర్కొన్న సంగతి తెలిసిందే.

India vs Srilanka: శిఖర్ టీం ద్వితీయశ్రేణిది కాదు.. శ్రీలంకకు పంపినందుకు సంతోషించాలి: పాక్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా
Former Pakistan Cricketer Danish Kaneria
Venkata Chari
|

Updated on: Jul 07, 2021 | 9:58 PM

Share

India vs Srilanka: శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ సారథ్యంలోని జట్టుపై ఆ దేశ మాజీ ఆటగాడు అర్జున రణతుంగ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియాను ద్వితీయ శ్రేణి జట్టు అని, శ్రీలంకకు అలాంటి జట్టును పంపి అవమానించారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ఖండించాడు. ప్రపంచకప్‌ గెలిచిన ఓ కెప్టెన్‌ ఇలా టీమిండియాపై మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నాడు. కేవలం మీడియాలో ప్రచారం కోసం ఇలా మాట్లాడాడని ఎద్దేవా చేశాడు. అసలు భారత జట్టును శ్రీలంకకు పంపించి ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేస్తున్నందుకు ఆనందపడాలని పేర్కొన్నాడు. ‘ద్వితీయ శ్రేణి జట్టును శ్రీలంక పంపకూడదని రణతుంగ అన్నాడు. అసలేం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. 1996లో వరల్డ్ కప్ గెలిచిన ఆయనకు మంచి పేరుంది. బహుశా ఇలాంటి ప్రచారాన్ని కోరుకునే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్‌ ఆడగలిగే 60 మంది క్రికెటర్లు టీమిండియాకు ఉన్నారు. అలాంటి జట్టు రెండుగా ఏర్పాటు చేయడం మంచిదేనని, ఎక్కువ మంది ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయని’ కనేరియా తెలిపాడు.

‘భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్య, శిఖర్‌ ధావన్‌, యుజ్వేంద్ర చాహల్‌, కృనాల్‌ పాండ్య వీరంతా నిరంతరం భారత టీంతో ఆడుతున్న వారేనని కనేరియా గుర్తు చేశాడు. రణతుంగ లాంటా ప్రముఖ ఆటగాళ్లు ఇలా మాట్లాడడం బాధాకరం. సంచలనాల కోసం ఇలాంటి ప్రకటనలు చేయోద్దని శ్రీలంక క్రికెట్‌ రణతుంగకు చెప్పాలని’ కోరాడు. ‘ప్రస్తుతం లంక క్రికెట్‌ దారుణమైన స్థితిలో ఉంది. ఇంగ్లాండ్‌ పర్యటనే ఇందుకు చక్కని ఉదాహరణ. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఓటమి పాలయ్యారు. ఆ దేశ ఆటగాళ్లు క్రికెట్‌ ఆడటం మర్చిపోయినట్లున్నారు. టీమ్‌ఇండియా శ్రీలంకతో ఆడే వన్డే, టీ20 సిరీస్ ల్లో విజయం సాధిస్తుందని’ ధీమా వ్యక్తం చేశాడు.

Also Read:

Virat Kohli: తగ్గేదేలే.. ఫిట్‌నెస్‌ విషయంలో దుమ్ములేపుతున్న విరాట్

ICC Rankings: టీ20ల్లో కోహ్లీ, రాహుల్ ర్యాంకులు పదిలం.. టాప్ టెన్ లో రోహిత్‌కు దక్కని చోటు!