AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: ‘కాషాయం రంగు ఎక్కువైంది’.. టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ అసంతృప్తి

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్నీ టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ కోసం టీమ్ ఇండియా కొత్త జెర్సీ సోమవారం (మే 06) లాంఛ్ చేశారు

T20 World Cup 2024: 'కాషాయం రంగు ఎక్కువైంది'.. టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ అసంతృప్తి
Team India
Basha Shek
|

Updated on: May 06, 2024 | 8:12 PM

Share

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్నీ టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ కోసం టీమ్ ఇండియా కొత్త జెర్సీ సోమవారం (మే 06) లాంఛ్ చేశారు.. టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్‌షిప్ హక్కులను కొనుగోలు చేసిన అడిడాస్ ధర్మశాల వేదికగా టీమిండియా న్యూ జెర్సీని ఆవిష్కరించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సమక్షంలో ఈ కొత్త జెర్సీని విడుదల చేశాయి. కాగా బీసీసీఐ జెర్సీ విడుదల వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీ.. బ్లూ, ఆరెంజ్ కలర్ల కాంబినేషన్‍తో రూపొందింది. జెర్సీ ఎక్కువ శాతం బ్లూ కలర్‌లో ఉండగా.. భుజాలపై మాత్రం ఆరెంజ్ కలర్ ఉంది. దీనిపై వైట్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. కాలర్‌పై భారత జాతీయ పతాకం మూడు రంగులు ఉన్నాయి. జెర్సీ ఇరు వైపులా కూడా సైడ్‍కు ఆరెంజ్ కలర్‌లో లైన్‍ కనిపిస్తోంది. ఈసారి జెర్సీలో కాషాయ రంగు ఎక్కువగానే ఉంది. జెర్సీపై టీమిడియా పేరు కూడా ఆరెంజ్ రంగులోనే ఉంది.

ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అలాగే ఈ జెర్సీపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది జెర్సీని ‘స్టైలిష్’ అని పిలుస్తుంటే, మరికొందరు మాత్రం కాషాయం రంగు ఎక్కువైందంటూ కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్థాన్‌ తో హైవోల్టేజీ మ్యాచ్ జరుగనుంది.  ఆతర్వాత జూన్ 12 మరియు 15 తేదీల్లో వరుసగా USA , కెనడాతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడతారు.

ఇవి కూడా చదవండి

హెలికాప్టర్ తో టీమిండియా జెర్సీ లాంఛింగ్, వీడియో

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. రిజర్వ్‌లు: శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు