AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: టీమిండియా కచ్చితంగా టెస్టు సిరీస్ గెలుస్తుంది: ఇయాన్ చాపెల్

అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ తోనే ఇంగ్లండ్ తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంటుందని మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.

IND vs ENG: టీమిండియా కచ్చితంగా టెస్టు సిరీస్ గెలుస్తుంది: ఇయాన్ చాపెల్
Ian Chappell
Venkata Chari
|

Updated on: Jul 04, 2021 | 6:47 PM

Share

IND vs ENG: అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ తోనే ఇంగ్లండ్ తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంటుందని మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ లో న్యూజిలాండ్‌తో తలపడి టీమిండియా ఓడిపోయినప్పటికీ, ఇటీవలి కాలంలో భారత్ పేస్ బౌలింగ్ చాలా మెరుగుపడిందని, ప్రస్తుతం టీమండియా.. వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మాదిరిగా కనిపిస్తుందని అన్నారు. ఈమేరకు చాపెల్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో లో రాసుకొచ్చాడు. ‘ఇటీవలి కాలంలో భారత జట్టు నైపుణ్యం కలిగిన ఫాస్ట్ బౌలింగ్ టీంల సరసన చేరింది. ఫలితంగా, ఆస్ట్రేలియాలో విజయం సాధించిందని తెలిపారు. అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుందని వెల్లడించారు. ప్రస్తుతం ఆథిత్య జట్టును ఓడించేందుకు సమాన అవకాశాలు టీమిండియాలో ఉన్నాయి. మంచి ఫాస్ట్ బౌలింగ్ తో టీమిండియా ఇంగ్లండ్ తో ముందంజలో నిలుస్తుందని పేర్కొన్నారు.

ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి వారు టీమిండియా తరపున బాగా రాణిస్తున్నారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డారు. అలాగే న్యూజిలాండ్ టీం ఫాస్ట్ బౌలర్లను కూడా ప్రశంసించాడు. 1970, 90 లలో వెస్టిండీస్ బౌలింగ్ ను తలపించిందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను గెలుచుకోవడంలో టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నెర్, కైల్ జామిసన్ లాంటి పేస్ బౌలర్లు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.

క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు కంటే ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు ఉత్తమంగా రాణిస్తుందని చాపెల్ అభిప్రాయపడ్డారు. ఆండీ రాబర్ట్స్, మాల్కం మార్షల్, మైఖేల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్ ల చతుష్టయం ఆ సమయంలో చాలా భయంకరమైందిగా పేర్కొన్నాడు. వేగం విషయంలో వెస్టిండీస్ టీం ముందుంటుంది. కానీ, ఫలితాలను గమనిస్తే.. న్యూజిలాండ్ బౌలర్లు విజేతలుగా నిలుస్తారని తెలిపారు. న్యూజిలాండ్ పేస్ బౌలర్లు ఐదు మ్యాచ్‌లలో ఆడి 100 శాతం విజయాలను నమోదు చేయగా, వెస్టిండీస్ చతుష్టయం కేవలం ఆరు మ్యాచ్‌లలో మాత్రమే ఆడి, మూడు మ్యాచ్‌లను డ్రాగా చేసుకుందని తెలిపారు.

Also Reas:

Hyderabad Cricket Association: హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు ఎదురుదెబ్బ..!

Mithali Raj: మిథాలీ రాజ్ తరువాతే ధోనీ, విరాట్ కోహ్లీ.. ఏ రికార్డులోనో తెలుసా..?

Wimbledon 2021: షూస్ మర్చిపోయి కోర్టులోకి ఎంటరైన ఆస్ట్రేలియా ప్లేయర్.. స్పెషల్ డెలివరీ అంటూ నెటిజన్ల చమత్కారం..!