Hyderabad Cricket Association: హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు ఎదురుదెబ్బ..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కు ఎదురుదెబ్బ తగిలింది. అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేస్తూ జస్టిస్ దీపక్ వర్మ ప్రకటించాడు.
Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కు ఎదురుదెబ్బ తగిలింది. అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేస్తూ జస్టిస్ దీపక్ వర్మ ప్రకటించాడు. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కాగా, హెచ్‌సీఏ అధ్యకుడు అజారుద్దీన్ ను అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి, ఇటీవలే నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో అజారుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అంబుడ్స్ మెన్ జస్టిస్ దీపక్ వర్మ అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తప్పు పడుతున్నారు. అంబుడ్స్ మన్ దీపక్ వర్మని వ్యతిరేకిస్తూ మరో ప్రకటన విడుదల చేశారు. అసలు దీపక్ వర్మ నియామకమే చెల్లదని, అలాంటింది అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేసే అధికారం దీపక్ వర్మకి లేదని పేర్కొన్నారు.
మరోవైపు అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించి.. ఆపెక్స్ కౌన్సిల్ లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారని, కేవలం 5గురు సభ్యులు (జాన్ మనోజ్, విజయనంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ) ఓ వర్గంగా ఏర్పడి నాపై కుట్లు చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్‌సీఏ లో జరిగినఅవినీతిని అరికట్టేందుకు సమర్థవంతమైన ఓ వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే.. ఈ వర్గమే తప్పు పట్టిందని ఆరోపించారు. వాళ్లందరి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతూ ఇలా నాపై కక్ష్య పెంచుకున్నారని వెల్లడించాడు. అపెక్స్ కౌన్సిల్ మరో అడుగు ముందుకేసి జాన్ మనోజ్ అనే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించింది. ఇలా రోజుకో మలుపు తిరుగుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలు.. అపెక్స్ కౌన్సిల్ రద్దు నిర్ణయంతో.. ఇంకెంత ముదురనున్నాయో. మరి ఈ విషయంలో బీసీసీఐ తలదూర్చకపోవడం గమనార్హం. హెచ్‌సీఏలో ముదురుతున్న గొడవలతో.. అసోసియేషన్‌లో ఉన్న ఆటగాళ్లంతా అయోమయంలో ఉన్నారు. వివాదాలతో హెచ్‌సీఏ పేరు మసకబారిపోతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన వివాదాలకు స్వస్తి చెప్పి పాలనపై శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు.
Also Read:
Virat Kohli: పెళ్లిలో భార్యతో కలిసి చిందులేసిన టీమిండియా కెప్టెన్… ( వీడియో )
Mithali Raj: మిథాలీ రాజ్ తరువాతే ధోనీ, విరాట్ కోహ్లీ.. ఏ రికార్డులోనో తెలుసా..?