Team India: బ్యాటింగ్, బౌలింగ్‌తోనే కాదు భయ్యో.. చీరతో అభిమానులను ఫిదా చేస్తోన్న లేడీ డాన్..
Jemimah Rodrigues Saree Look: జెమిమా రోడ్రిగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చీర ధరించిన తన ఫొటోలను పంచుకుంది. ఆమె అందమైన చీర లుక్ అభిమానులను ఆకట్టుకుంది. అభిమానులు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ వందలాది కామెంట్లు చేశారు. కొందరు ఆమె భారత జెర్సీలో మరింత అందంగా కనిపిస్తుందని అన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Jemimah Rodrigues Saree Look: ఇతర క్రీడలతో పోలిస్తే భారతదేశంలో క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతారనే విషయం తెలిసిందే. పురుషుల క్రికెట్‌కు క్రేజ్ చాలా ఎక్కువ. అయితే గత కొంత కాలంగా మహిళా క్రికెటర్లు కూడా అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమను అందుకుంటున్నారు. భారతీయ అభిమానులు సోషల్ మీడియాలో మహిళా క్రికెటర్లను తెగ ఫాలో చేస్తుంటారు. దీని కారణంగా, వారందరికీ అభిమానుల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో స్మృతి మంధాన, శ్రేయాంక పాటిల్‌లను జాతీయ క్రష్‌లుగా పరిగణిస్తుంటారు. అయితే, అందం విషయానికి వస్తే, టీమిండియా బ్యాట్స్‌మెన్ జెమీమా రోడ్రిగ్స్ ఎవరికీ తక్కువ కాదు. జెమీమా తన స్పోర్ట్స్‌తో పాటు తన సరదా స్టైల్‌కు కూడా ప్రసిద్ది చెందింది. అందంలో కూడా ఆమె ఎవరికీ తక్కువేం కాదండోయ్.
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో కూడా ఇలాంటిదే కనిపించింది. క్రికెటర్లందరూ విభిన్న స్టైల్స్‌లో కనిపించగా, మహిళా ఆటగాళ్లు తమ అందం, దుస్తుల విషయంలో ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తూ కనిపించారు. ఈ అవార్డు వేడుక సందర్భంగా జెమీమా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలను పంచుకున్నారు. ఒక అభిమాని ఆమెను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా కామెంట్స్ చేశాడు.
జెమీమా ఫొటోపై అభిమానుల కామెంట్స్..
View this post on Instagram
జెమిమా రోడ్రిగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ఆమె తన రెండు ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో భారత జెర్సీలో కనిపించే జెమిమా రోడ్రిగ్స్.. చీర ధరించి ఉన్నట్లు చూడొచ్చు. జెమీమా చీరలో చాలా అందంగా ఉంది. అభిమానులు కూడా ఆమెను ప్రశంసించడంలో వెనుకంజ వేయలేదు.
జెమీమా చీర కట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జెమిమా రోడ్రిగ్స్ చీరపై ఒక అభిమాని కామెంట్స్ చేస్తూ, “ఈ దుస్తులు బాగున్నాయి. కానీ, భారతీయ జెర్సీలో ఇంకా అందంగా ఉంటారంటూ కామెంట్ చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..