
ODI World Cup 2023: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూన్ 27న భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అన్ని టీమ్‌లకు సన్నద్ధం కావడానికి 100 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. మరోవైపు, వెన్ను గాయంతో పూర్తిగా ఫిట్‌గా లేని శ్రేయాస్ అయ్యర్ రూపంలో ఆతిథ్య భారత్‌కు టోర్నీకి ముందు పెద్ద దెబ్బ తగలవచ్చని తెలుస్తుంది.
శ్రేయాస్ అయ్యర్‌కు వెన్ను సమస్య కారణంగా, అతను శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత అతను ఆసియా కప్ వరకు పూర్తి ఫిట్‌గా ఉంటాడని అందరూ భావించారు. శస్త్రచికిత్స కారణంగా అయ్యర్ ఐపీఎల్ 16వ సీజన్ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పుడు అతను నెమ్మదిగా కోలుకోవడంపై బీసీసీఐ వైద్య బృందం ఆందోళన వ్యక్తం చేసింది.
అయ్యర్ కోలుకోవడం గురించి, బీసీసీఐ సీనియర్ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. అతను ప్రపంచ కప్ వరకు ఫిట్‌గా ఉంటాడని ఆశాభావంతో ఉన్నాడు. అయితే దీని గురించి శ్రేయాస్ ఖచ్చితంగా ఏమీ చెప్పలేడని తెలిసింది. అయితే రాహుల్, బుమ్రా కోలుకోవడంతో టీమిండియాకు గుడ్ న్యూస్ అందినట్లైంది.
వన్డే ప్రపంచ కప్ 2023కి ముందు, భారత జట్టు తమ సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఆసియా కప్‌ను కీలకంగా భావిస్తోంది. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్‌ను మెగా ఈవెంట్‌కు దూరం చేస్తే, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లకు ప్రధాన జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ఆడటంలో చాలా నిష్ణాతులుగా భావిస్తారు. అంతే కాకుండా మిడిలార్డర్‌లో స్పీడ్‌గా పరుగులు రాబట్టగల సత్తా కూడా అతనికి ఉంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..