Cheteshwar Pujara: 20 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా నయా వాల్.. ఆ ఇద్దరి ఎఫెక్ట్‌తోనేనా?
Cheteshwar Pujara Retirement: టీమిండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో తన 20 సంవత్సరాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చతేశ్వర్ పుజారా 2005 సంవత్సరంలో దేశీయ క్రికెట్‌లో తన తొలి మ్యాచ్ ఆడాడు. ఇది సౌరాష్ట్ర వర్సెస్ విదర్భ మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్. అతను ఫిబ్రవరి 2025లో గుజరాత్‌తో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు.

Cheteshwar Pujara Retirement From Cricket: టీమిండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో తన 20 సంవత్సరాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చతేశ్వర్ పుజారా 2005 సంవత్సరంలో దేశీయ క్రికెట్‌లో తన తొలి మ్యాచ్ ఆడాడు. ఇది సౌరాష్ట్ర వర్సెస్ విదర్భ మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్. అతను ఫిబ్రవరి 2025లో గుజరాత్‌తో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు.
13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్..
2010 సంవత్సరంలో పుజారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. 2013లో బులవాయోలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. పుజారా వన్డే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ, అరంగేట్రం తర్వాత 13 సంవత్సరాలు టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాడు. జూన్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో అతను ఆడాడు.
View this post on Instagram
37 ఏళ్ల పుజారా 2010లో అరంగేట్రం చేసి 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. అతను 43.60 సగటుతో 7,195 టెస్ట్ పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేశాడు. దశాబ్ద కాలంగా భారత జట్టు అత్యంత విశ్వసనీయ నంబర్ 3లో కీలక పాత్ర పోషించాడు. స్వదేశంలో, విదేశాలలో భారత జట్టు సాధించిన కొన్ని కీలక టెస్ట్ విజయాలలో ప్రధాన పాత్ర పోషించాడు. జూన్ 2023లో ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పుజరా చివరి టెస్ట్‌గా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








