IND vs AFG: ఆఫ్గనిస్తాన్‌తో టీ 20 సిరీస్‌కు భారత జట్టు .. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే?

భారత టీ20 కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ డైలమాలో పడింది. దీంతో కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. అయితే ప్రస్తుతమున్న సమచారం ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌ తో టీ20 సిరీస్ కు..

IND vs AFG: ఆఫ్గనిస్తాన్‌తో టీ 20 సిరీస్‌కు భారత జట్టు .. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే?
Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2023 | 3:47 PM

దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత, భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఆ జట్టుతో మొత్తం మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కు ముందు భారత్‌కు ఇదే  చివరి టీ 20 సిరీస్‌. ఇదిలా ఉంటే భారత టీ20 కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ డైలమాలో పడింది. దీంతో కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడుతోంది. అయితే ప్రస్తుతమున్న సమచారం ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌ తో టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ నే ఎంపిక చేయనున్నారట. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు సారథ్యం వహించాల్సిందిగా సెలక్టర్లు అలాగే బీసీసీఐ రోహిత్‌ని కోరుతోంది. కాబట్టి రోహిత్ మళ్లీ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.

“జట్టుకు ఎవరు నాయకత్వం వహించాలో సెలెక్టర్లు నిర్ణయిస్తారు. మేము రోహిత్‌తో సుదీర్ఘంగా చర్చించాము. అతను T20 ప్రపంచ కప్‌లో నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దీంతో పాటు ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. దీని గురించి అజిత్ (అగార్కర్) రోహిత్‌తో మాట్లాడతాడు” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే పాండ్యా చీలమండ గాయం కారణంగా అక్టోబర్‌లో భారత్-బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. 2024 నాటికి IPL తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌కు నాయకత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ కూడా చీలమండ గాయంతో దూరమయ్యాడు. ఆసియా క్రీడల్లో భారత్‌కు నాయకత్వం వహించిన మరో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయపడ్డాడు. కాబట్టి, ఇప్పుడు తిరిగి రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించనున్నారు. భారత్-ఆఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ముందే రోహిత్ శర్మ టీ20లకు తిరిగి వస్తానని సూచించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..