AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy: గంభీర్ ఫేవరేట్ ప్లేయర్ కెప్టెన్సీలో ఆడనున్న కోహ్లీ, పంత్.. ఢిల్లీ రంజీ జట్టులో చోటు ఖరారు

Delhi Ranji Trophy Team: సౌరాష్ట్రతో జరిగే తదుపరి రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు ఖరారు చేశారు. 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడనేది పెద్ద వార్త.. అయితే ఆయుష్ బడోని జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా 8 ఏళ్ల తర్వాత రంజీ జట్టులోకి వచ్చాడు.

Ranji Trophy: గంభీర్ ఫేవరేట్ ప్లేయర్ కెప్టెన్సీలో ఆడనున్న కోహ్లీ, పంత్.. ఢిల్లీ రంజీ జట్టులో చోటు ఖరారు
Virat Kohli Rishabh Pant
Venkata Chari
|

Updated on: Jan 17, 2025 | 6:23 PM

Share

Virat Kohli and Rishabh Pant: బీసీసీఐ కఠిన నిబంధనల తర్వాత ఇప్పుడు టీమిండియా స్టార్లు మైదానంలోకి రావడం ప్రారంభించారు. ఢిల్లీ రంజీ ట్రోఫీ జట్టు స్వ్కాడ్‌తో ఇది రుజువైంది. ఢిల్లీ రంజీ జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కడం పెద్ద వార్త. 13 ఏళ్ల తర్వాత ఢిల్లీ రంజీ జట్టులో ఈ పేరు చేరింది. అతనితో పాటు, రిషబ్ పంత్ కూడా ఢిల్లీ జట్టులో ఉన్నాడు. అతను 8 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ ఆడబోతున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు జూనియర్ క్రికెటర్ కెప్టెన్సీలో ఆడటం కీలక వార్తగా నిలిచింది. నిజానికి, ఢిల్లీ రంజీ జట్టు కమాండ్‌ను ఆయుష్ బదోనీకి అప్పగించారు.

విరాట్ ఆడటం కష్టమే..

విరాట్ కోహ్లీ పేరును జట్టులో చేర్చారు. అయితే, అతను సౌరాష్ట్రతో ఆడకపోవచ్చని తెలుస్తోంది. నిజానికి, సిడ్నీ టెస్టులో విరాట్ కోహ్లీ మెడ బెణుకింది. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇందుకోసం విరాట్ ఇంజెక్షన్లు కూడా తీసుకున్నాడు. ఒకవేళ విరాట్‌ ఫిట్‌గా లేకపోతే ఈ మ్యాచ్‌లో ఆడలేడు. కానీ, జట్టుతో కలిసి రాజ్‌కోట్‌లో కచ్చితంగా ఉంటాడు. మరోవైపు పంత్ ఈ మ్యాచ్ ఆడడం ఖాయం. దేశవాళీ క్రికెట్ ఆడాలని, లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని బీసీసీఐ ఆటగాళ్లందరికీ సూచించిన సంగతి తెలిసిందే.

రంజీ ట్రోఫీలో విరాట్ ప్రదర్శన..

రంజీ ట్రోఫీలో రిషబ్ పంత్ 17 మ్యాచ్‌ల్లో 58.12 సగటుతో 1395 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో పంత్ 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 308 పరుగులు. మరోవైపు విరాట్ కోహ్లీ 23 రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీల్లో ఐదు సెంచరీలు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..