Video: ‘మిల్కా సింగ్’లా మారిన శ్రేయాస్ అయ్యర్.. గంభీర్ రాకతో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ?
Shreyas Iyer Video: శ్రేయాస్ అయ్యర్ చాలా కాలంగా టీమిండియా తరపున ఏ మ్యాచ్ ఆడలేదు. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకుగాను శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ తీసేసిన సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ ఇటీవలే టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యర్ మరోసారి జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. గౌతమ్ గంభీర్ IPLలో అయ్యర్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ చాలా కాలంగా టీమిండియా తరపున ఏ మ్యాచ్ ఆడలేదు. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకుగాను శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ తీసేసిన సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ ఇటీవలే టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యర్ మరోసారి జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. ఈ అంచనాల నడుమ అతను తీవ్రంగా కష్టడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం తన ప్రాక్టీస్ ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియాలో నిరంతరం పోస్ట్ చేస్తున్నాడు.
వర్షంలో చెమట చిందిస్తోన్న శ్రేయాస్..
శ్రేయాస్ అయ్యర్ వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను వర్షం మధ్య చెమటలు చిందిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రసిద్ధ అథ్లెట్ మిల్కా సింగ్ లాగా అయ్యర్ తడి ట్రాక్‌పై పరుగెత్తినట్లు ఉందని చెబుతున్నారు. చాలా మంది అభిమానులు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. శ్రేయాస్ కృషిని ప్రశంసిస్తున్నారు. జులై 10న, అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఓ ఫొటోను పంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం కూడా అతను రన్నింగ్‌తో వ్యాయామం చేస్తున్న ఒక వీడియోను పంచుకున్నాడు.
Shreyas Iyer training hard for the international season. 🌟pic.twitter.com/QT7RdDMhh3
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024
ఏడు నెలల నుంచి అవకాశం రాలేదు..
View this post on Instagram
శ్రేయాస్ అయ్యర్ తన చివరి మ్యాచ్‌ని 2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తరపున ఆడాడు. అంటే 7 నెలల పాటు టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అయ్యర్ చాలా కాలంగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నాడు. ఇందుకోసం రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ షరతును కూడా అంగీకరించి ముంబై తరపున మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ట్రోఫీని అందించాడు. అయినప్పటికీ అతనికి జట్టులో చోటు దక్కలేదు. రోహిత్ శర్మ అతడిని టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేయలేదు. జింబాబ్వే టూర్‌లో కూడా రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ వంటి యువకులకు అవకాశం కల్పించారు. అయితే, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయినప్పటి నుంచి శ్రేయాస్ పునరాగమనానికి డోర్లు ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
