AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: గౌతమ్ గంభీర్ ఎంట్రీతో చిక్కుల్లో పడిన హార్దిక్ పాండ్యా.. రిటైర్మెంట్ చేయాల్సిందేనా?

Gautam Gambhir: హార్దిక్ పాండ్యా.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పాండ్యా ఇటు బాల్, అటు బ్యాటింగ్‌తో అద్భుతాలు చేసి భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు. ఈ ఆటగాడు దక్షిణాఫ్రికా 3 విలువైన వికెట్లను తీయగలిగాడు. దీని కారణంగా 17 సంవత్సరాల తర్వాత భారతదేశం టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అయితే, ఇప్పుడు ఈ ఆటగాడు చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది.

Hardik Pandya: గౌతమ్ గంభీర్ ఎంట్రీతో చిక్కుల్లో పడిన హార్దిక్ పాండ్యా.. రిటైర్మెంట్ చేయాల్సిందేనా?
Gautam Gambhir Hardik Pandya
Venkata Chari
|

Updated on: Jul 12, 2024 | 3:44 PM

Share

Gautam Gambhir: హార్దిక్ పాండ్యా.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పాండ్యా ఇటు బాల్, అటు బ్యాటింగ్‌తో అద్భుతాలు చేసి భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు. ఈ ఆటగాడు దక్షిణాఫ్రికా 3 విలువైన వికెట్లను తీయగలిగాడు. దీని కారణంగా 17 సంవత్సరాల తర్వాత భారతదేశం టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అయితే, ఇప్పుడు ఈ ఆటగాడు చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. పాండ్యా రానున్న రోజులు బాగోలేవని, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచనలే ఇందుకు కారణమని చెబుతున్నారు.

గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడు?

స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, మూడు ఫార్మాట్‌లను ఆడగలిగితే, ఖచ్చితంగా వాటిని ఆడాలని నేను నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చాడు. గంభీర్ మాట్లాడుతూ, ‘గాయాలు అడ్డుకానేకాదు. గాయమైతే మళ్లీ కోలుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్ ఖచ్చితంగా మూడు ఫార్మాట్లలో ఆడాలి. ఏ బౌలర్‌ను రెడ్ బాల్ లేదా వైట్ బాల్ స్పెషలిస్ట్ అని పిలవడం ఇష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

గంభీర్ ఏ ఆటగాడిని కేవలం టెస్టు కోసం మాత్రమే ఉంచుకోవాలని లేదా వన్డే లేదా టీ20 కోసం మాత్రమే ఆడాలని కోరుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. ఏ ఆటగాడి పనిభారాన్ని నిర్వహించడానికి నేను అనుకూలంగా లేను. ప్రొఫెషనల్ క్రికెటర్ కెరీర్ చిన్నదని, అందుకే వీలైనంత ఎక్కువగా ఆడాలని గంభీర్ అన్నాడు. ఆటగాడు మూడు ఫార్మాట్లలో ఆడాలి అంటూ తెలిపాడు.

గంభీర్ ఆలోచనతో హార్దిక్‌కు ముప్పు..

ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు హార్దిక్ పాండ్యాను టెస్ట్ ఫార్మాట్‌లో ఆడమని బలవంతం చేస్తారా? హార్దిక్ పాండ్యా వన్డే, టీ20 ఫార్మాట్లలో మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ గాయాల భయంతో టెస్టు క్రికెట్ ఆడడం లేదు. హార్దిక్ తన చివరి టెస్టును 2018లో ఆడాడు. అయితే ఇప్పుడు అతను టీమిండియా తరపున మూడో ఫార్మాట్ కూడా ఆడాల్సి ఉంటుందని తెలుస్తోంది. గత రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్స్‌లో టీమిండియా ఓడిపోయింది. గౌతమ్ గంభీర్ ఈ ఓటమి హ్యాట్రిక్ అవ్వాలని ఎప్పటికీ కోరుకోడు. కాబట్టి అలాంటి పరిస్థితిలో, అతనికి అవకాశం వస్తే, అతను ఖచ్చితంగా పాండ్యాను టెస్ట్ ఆడమని అడగవచ్చు అని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..