AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav: రూ. 10 లక్షలతో మొదలై.. కోట్లకు పడగలెత్తిన టీమిండియా టీ20 సారథి.. ‘స్కై’ నికర ఆస్తి ఎంతంటే?

Suryakumar Yadav Net Worth: భారత్-శ్రీలంక మధ్య జులై 27 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. టీ20 కెప్టెన్సీలో దీర్ఘకాలిక ఎంపిక కావాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కోరుతున్నాడు. అందుకే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా అవకాశం రాలేదు. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్య జట్టుకు నాయకత్వం వహించడాన్ని చూడవచ్చు.

Suryakumar Yadav: రూ. 10 లక్షలతో మొదలై.. కోట్లకు పడగలెత్తిన టీమిండియా టీ20 సారథి.. 'స్కై' నికర ఆస్తి ఎంతంటే?
Suryakumar Yadav Net Worth
Venkata Chari
|

Updated on: Jul 20, 2024 | 8:00 PM

Share

Suryakumar Yadav Net Worth: భారత్-శ్రీలంక మధ్య జులై 27 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. టీ20 కెప్టెన్సీలో దీర్ఘకాలిక ఎంపిక కావాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కోరుతున్నాడు. అందుకే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా అవకాశం రాలేదు. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్య జట్టుకు నాయకత్వం వహించడాన్ని చూడవచ్చు. సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. అతను 2021 సంవత్సరంలో భారతదేశం కోసం తన మొదటి మ్యాచ్ ఆడాడు. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశాడు.

సూర్యకుమార్ యాదవ్ నికర విలువ..

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత సూర్యకుమార్ వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం అతను భారత నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. సూర్యకుమార్ బ్యాట్ నుంచి పరుగులు వస్తున్న కొద్దీ అతని సంపాదన కూడా అదే విధంగా పెరుగుతోంది. ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్ కూడా అయ్యాడు. కాబట్టి రానున్న రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు అతడిని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు అతని బ్రాండ్ విలువ ఫీల్డ్ వెలుపల కూడా పెరుగుతోంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఆస్తులు దాదాపు రూ.55 కోట్లుగా మారాయి.

రూ. 10 లక్షల నుంచి కోట్ల వరకు ప్రయాణం..

2013 వరకు, ఐపీఎల్ నుంచి సూర్యకుమార్ ఆదాయం సీజన్‌కు రూ. 10 లక్షలు మాత్రమే. అది 2022 నాటికి రూ. 8 కోట్లకు పెరిగింది. బీసీసీఐ నుంచి ఏటా రూ.3 కోట్లు అందుకుంటున్నాడు. అతను ప్రస్తుతం BCCI లిస్టులో గ్రేడ్ B లో చేరాడు. ఇది మాత్రమే కాదు, ప్రముఖ భారతీయ ఫాంటసీ యాప్‌లు అయిన ఫ్రీ హిట్, డ్రీమ్ 11కి సూర్యకుమార్ బ్రాండ్ అంబాసిడర్ కూడా. అతను మాక్సిమా వాచీలు, సారిన్ స్పోర్ట్స్, అనేక ఇతర బ్రాండ్‌లకు ప్రమోషన్లు కూడా చేస్తున్నాడు. వాటి నుంచి అతను భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు.

విలాసవంతమైన జీవితం..

సూర్యకి జోంగా కారు ఉంది. నివేదిక ప్రకారం దీని ధర రూ.3 కోట్లకు పైగానే. జోంగాతో కలిసి దిగిన ఫొటోను కూడా సూర్య షేర్ చేశాడు. అతను మెర్సిడెస్ బెంజ్ GLE కారును కూడా కలిగి ఉన్నాడు. ఇక కారు ధర గురించి మాట్లాడుకుంటే దాదాపు రూ.2 కోట్లుపైనే ఉంటుంది.

సూర్య ఇల్లు కూడా కోటి రూపాయలు పలుకుతుంది. అతనికి ముంబైలోని చంబూర్‌లో అపార్ట్‌మెంట్ ఉంది. దీని ధర రూ.8 నుంచి 10 కోట్లుగా ఉంటుంది. సూర్యకుమార్ 7 జులై 2016న దేవిషా శెట్టిని వివాహం చేసుకున్నాడు. దేవిషా శిక్షణ పొందిన డ్యాన్సర్. డ్యాన్స్ కోచింగ్ కూడా ఇస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..