AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే టీమిండియాకు ఉన్నది ఒకటే దారి..!

ఈ సారి దీపావళి భారత్‌కు కలిసి రాలేదనే చెప్పాలి. భారత జట్టుకు సొంత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో షాకింగ్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీపావళి తర్వాత భారత్‌కు గడ్డు కాలమే అని చెప్పాలి. భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో, చివరి టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సిరీస్‌లో టీమిండియా 0-2తో వెనుకబడింది. దీంతో 3వ టెస్టులోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీిమండియా ప్రయత్నిస్తుంది.

Team India: ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే టీమిండియాకు ఉన్నది ఒకటే దారి..!
Team India
Velpula Bharath Rao
|

Updated on: Oct 29, 2024 | 1:59 PM

Share

మరికొద్ది రెండు రోజుల్లో దేశం మొత్తం దీపావళి పండుగను జరుపుకోనుంది. దేశం మొత్తం దీపాలతో నిండిపోనుంది. పటాసులు కాలుస్తూ ఎక్కడ చూసినా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భారత క్రికెట్ జట్టు కూడా ఆ రోజున పండగను జరుపుకోనుంది. ఇటీవలి ప్రదర్శనను పక్కన పెడితే, దీపావళి తర్వాత భారత్‌కు గడ్డు కాలమే అని చెప్పాలి. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయిన టీమ్ ఇండియా ఇప్పటికే కోలుకొని దెబ్బ తగిలింది.

ఈసారి దీపావళిని భారత క్రికెట్ జట్టు, అభిమానులు న్యూజిలాండ్‌తో టెస్ట్ గెలిచి అనందంలో జరుపుకుంటామని ఊహించారు. కానీ భారత్ ఘోర ఓటమిని చవిచూడాల్సి వస్తుంది. 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి న్యూజిలాండ్ టీమిండియాను ఆశ్చర్యపరిచింది. టీం ఇండియా మాత్రమే కాదు, ఇది మొత్తం ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే గత 12 ఏళ్లలో ఏ జట్టు ఆ  రికార్డును ఛేదించలేకపోయింది.

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది.  ఇప్పటికే సిరీస్‌లో టీమిండియా 0-2తో వెనుకబడింది. దీంతో 3వ టెస్టులోనైనా ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉండడానికి ఈ మ్యాచ్ గెలవడం భారత్‌కు ఎంతో ముఖ్యం. టీమ్ ఇండియా గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి దారులు ఇంకా తెరిచే ఉంటాయి. ఆ తర్వత మరో రెండు నెలల పాటు భారత్ ఆస్ట్రేలియాలో 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. WTC ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమ్ ఇండియా 6 టెస్టుల్లో 4 గెలవాలి. ఆస్ట్రేలియాలో టీం ఇండియా 5 మ్యాచ్‌ల్లో 4 గెలవడం దాదాపు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో టీమ్‌ఇండియా గెలిస్తే ఆస్ట్రేలియాలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..