Virat Kohli-Anushka Sharma: కోహ్లీ స్థానంలో నేనుంటే అనుష్కను పెళ్లి చేసుకోను: అక్తర్ కీలక వ్యాఖ్యలు

Shoaib Akhtar: 2017లో విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మను పెళ్లాడిన విషయం తెలిసిందే. దీనికి ముందు, ఇద్దరూ చాలా కాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లిని ఇటీవల అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Virat Kohli-Anushka Sharma: కోహ్లీ స్థానంలో నేనుంటే అనుష్కను పెళ్లి చేసుకోను: అక్తర్ కీలక వ్యాఖ్యలు
Galery Virat Kohli And Anushka Sharma Pics
Follow us
Venkata Chari

|

Updated on: Jan 24, 2022 | 12:14 PM

Virat Kohli-Anushka Sharma: అనుష్క శర్మ(Anushka Sharma)పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి(Virat Kohli) స్థానంలో తాను ఉండి ఉంటే అనుష్కను పెళ్లి చేసుకునేవాడిని కాదని అక్తర్ పేర్కొన్నాడు. ఎందుకంటే, పెళ్లి అనేది చాలా బాధ్యతతో కూడుకున్నదంటూ తెలిపాడు. విరాట్‌ను టీమిండియా కెప్టెన్‌గా చేయడానికి తాను ఎప్పుడూ అనుకూలంగా లేనంటూ మాట్లాడాడు.

షోయబ్ అక్తర్ మాట్లాడుతూ , “ గత ఆరు-ఏడేళ్లుగా విరాట్ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి నేను ఇష్టపడలేదు. అతను 100-120 పరుగులు చేయడాన్ని నేను చూడాలనుకుంటున్నాను. బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలి. నేను అతని స్థానంలో ఉంటే, నేను వివాహం చేసుకోను. నేను కేవలం పరుగులు సాధిస్తూనే ఉంటాను. రాబోయే 10-12 సంవత్సరాల పాటు నా బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తాను. ఇది కెరీర్‌లో తిరిగి రాని చాలా ముఖ్యమైన సమయం” అంటూ చెప్పుకొచ్చాడు.

“పెళ్లి చేసుకోవడం తప్పు అని నేను అనడం లేదు. కానీ భారతదేశం కోసం ఆడుతున్న సమయంలో గర్వపడాలి. విరాట్ కోహ్లి అంటే అభిమానులకు పిచ్చి. ఈ ప్రేమను విరాట్ 20 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగించాలి” అని తెలిపాడు.

అనంతరం పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఆటను ప్రభావితం చేస్తుందనే విషయంపై మాట్లాడుతూ, “కచ్చితంగా అవును. బాధ్యత పెరిగేకొద్దీ, పిల్లలను పెంచడంలోనూ ఒత్తిడి పెరుగుతుంది. ఒక క్రికెటర్‌కు 14-15 ఏళ్ల కెరీర్‌ ఉంటుంది. ఇందులో కేవలం నాలుగు-ఐదు సంవత్సరాల పాటు పీక్‌లో ఉంటారు. ఆ సమయాన్ని విరాట్ దాటేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: IND vs SA: ఆ జట్టు మా కళ్లు తెరిపించింది.. లోపమంతా అక్కడే.. త్వరలో సెట్ చేస్తాం: రాహుల్ ద్రవిడ్

Watch Video: కోల్‌కతాతో కటీఫ్.. భావోద్వేగానికి గురైన టీమిండియా యంగ్ ప్లేయర్.. వైరలవుతోన్న వీడియో