Team India: 5 నెలలు.. 4 టీంలు.. టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?

Team India's Full Schedule: వచ్చే 5 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ పిచ్‌పై భారత జట్టు తమ తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. రానున్న 5 నెలల్లో టీమిండియా షెడ్యూల్ చాలా బిజీగా మారింది. 4 జట్లతో టీమిండియా తలపడనుంది.

Team India: 5 నెలలు.. 4 టీంలు.. టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?
Team India
Follow us

|

Updated on: Jan 24, 2022 | 12:59 PM

India Vs South Africa 2021: దక్షిణాఫ్రికా(South Africa)లో జరిగిన దాన్ని సరిదిద్దలేం. ఎందుకంటే అది ప్రస్తుతం చరిత్రగా మారింది. భారత క్రికెట్‌(Team India)కి అది గతం. కానీ, రేపటిని మరింత మెరుగ్గా మార్చుకునే ఛాన్స్ టీమిండియా ముందు ఉంది. వన్డే సిరీస్‌ ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా టూర్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(KL Rahul) మాట్లాడుతూ .. మెరుగ్గా రాణించాలంటే తప్పుల నుంచి నేర్చుకోవాలి. మరోసారి వాటిని పునరావృతం చేయకుండా ఉండాలి” అంటూ పేర్కొన్నాడు. వచ్చే 5 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ పిచ్‌పై భారత జట్టు తమ తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. రానున్న 5 నెలల్లో టీమిండియా షెడ్యూల్ చాలా బిజీగా మారింది. 4 జట్లతో టీమిండియా తలపడనుంది. ముఖ్యంగా, దక్షిణాఫ్రికాపై ప్రతీకారం కూడా తీర్చుకునే అవకాశం రానుంది.

భారత్ తన తదుపరి 5 నెలల అంతర్జాతీయ షెడ్యూల్‌ ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభమవుతుంది. జూన్ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో భారత్ తన అన్ని మ్యాచ్‌లను హోం గ్రౌండ్‌లో ఆడనుంది. రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ వెస్టిండీస్ ఆతిథ్యంతో ప్రారంభమై దక్షిణాఫ్రికాతో ముగుస్తుంది.

భారతలో వెస్టిండీస్ టీం పర్యటన.. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌లో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో కరీబియన్ జట్టు తొలుత 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత 3 టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లు ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. కాగా, ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 సిరీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్‌లో శ్రీలంక పర్యటన.. వెస్టిండీస్ ఆతిథ్యం తర్వాత శ్రీలంక టీం భారతదేశంలో పర్యటించనుంది. ఇందులో భాగంగా టెస్టు, టీ20 సిరీస్‌ల్లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ పర్యటనలో శ్రీలకం టీం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు 2 టెస్టులు ఆడనుంది. అనంతరం మార్చి 13 నుంచి 18 వరకు 3 టీ20ల సిరీస్‌ జరగనుంది.

ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ వన్డే సిరీస్.. మార్చిలోనే శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ ముగిసిన తర్వాత, భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. ఈ సిరీస్‌లు IPL 2022 ప్రారంభానికి ముందు జరగనున్నాయి. ఇందులో బహుశా టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా బెంచ్ బలాన్ని ప్రయత్నించాలని చూస్తోంది.

భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన.. ఆఫ్ఘనిస్థాన్‌లో వన్డే సిరీస్ తర్వాత, ఐపీఎల్ 2022 జరగనుంది. ఈ లీగ్ ముగిశాక, దక్షిణాఫ్రికాతో సమరానికి భారత్ సిద్ధమవనుంది. పర్యనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.

అనంతరం ఐదు టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. వాస్తవానికి ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. టీ20 సిరీస్‌లో 5-0తో వన్డే సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది.

Also Read: Virat Kohli-Anushka Sharma: కోహ్లీ స్థానంలో నేనుంటే అనుష్కను పెళ్లి చేసుకోను: అక్తర్ కీలక వ్యాఖ్యలు

IND vs SA: ఆ జట్టు మా కళ్లు తెరిపించింది.. లోపమంతా అక్కడే.. త్వరలో సెట్ చేస్తాం: రాహుల్ ద్రవిడ్

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??