Watch Video: గోవా వీధుల్లో ఎంఎస్ ధోని హల్చల్.. వైరల్ వీడియో చూస్తే ఫిదానే

Mahendra Singh Dhoni In Goa Video Viral: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే, ఆయనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే, వెంటనేే వైరలవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

Watch Video: గోవా వీధుల్లో ఎంఎస్ ధోని హల్చల్.. వైరల్ వీడియో చూస్తే ఫిదానే
Ms Dhoni Video
Follow us

|

Updated on: Oct 25, 2024 | 11:02 AM

Mahendra Singh Dhoni In Goa Video Viral: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికీ ఫాన్ ఫాలోయింగ్‌లో ఏమాత్రం తగ్గడం లేదు. అభిమానులు ఇప్పటికీ ధోనీని మైదానంలో ఆడటం చూడాలనుకుంటున్నారు. ధోనీ ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడతున్న సంగతి తెలిసిందే. 2025 ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నగా మిగిలిపోయింది. ధోనీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఎంఎస్ ధోని ప్లేయర్‌గా ఫీల్డ్‌లో కనిపిస్తాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. వీటన్నింటి మధ్య మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ధోని చాలా సింపుల్‌గా కనిపించాడు. ఇదేదో యాడ్ షూట్‌ సమయంలో తీసినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో, అభిమానులు కూడా ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు.

మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన వైరల్ వీడియో..

మహేంద్ర సింగ్ ధోనీ గోవాలో కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. ధోని వ్యానిటీ వ్యాన్‌లో నుంచి దిగి కారు వైపు వెళ్లడం వీడియోలో చూడవచ్చు. అప్పుడే అభిమానులు కెమెరాలో బంధించారు. ఈ వీడియోలో ధోనీ వైట్ కలర్ దుస్తుల్లో కనిపిస్తున్నాడు. అభిమానులు కూడా తమ అభిమాన క్రికెటర్‌పై విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు.

కొన్ని నెలల క్రితం, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీపై అన్ని రకాల ఆరోపణలు చేశాడు. ధోనీ కారణంగా యువరాజ్ సింగ్ కెరీర్ ముగిసిందని విమర్శించాడు. యువరాజ్ సింగ్ తన కెరీర్‌లో మరింత మెరుగ్గా రాణించేవాడు. అదే సమయంలో, హర్భజన్ సింగ్ కూడా మహేంద్ర సింగ్ ధోనీని సైగల ద్వారా చాలాసార్లు లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటీవల, టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ ధోనీపై అన్ని రకాల తీవ్రమైన ఆరోపణలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. నేను ఎప్పుడైనా నా ఆత్మకథ రాసుకున్నా లేదా నా స్వంత పోడ్‌కాస్ట్ ప్రారంభించినా, నేను ప్రతిదీ బహిరంగంగా చెబుతాను అంటూ బాంబ్ పేల్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..