IND vs AUS 3rd T20I: టికెట్ల కోసం అభిమానుల పడిగాపులు.. జింఖానా గ్రౌండ్, ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనలు..

|

Sep 21, 2022 | 10:37 AM

38 వేల టికెట్ల అమ్మకాలపై కూడా గందరగోళం నెలకొని ఉంది. రూ. 850 నుంచి రూ. 10 వేల వరకూ ఈ టికెట్లను అమ్ముతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 15న పేటీఎం యాప్‌లో టికెట్లు ఇలా పెట్టారో లేదో..

IND vs AUS 3rd T20I: టికెట్ల కోసం అభిమానుల పడిగాపులు.. జింఖానా గ్రౌండ్, ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనలు..
Ind Vs Aus Uppal Stadium
Follow us on

ఉప్పల్‌ మ్యాచ్‌ టికెట్ల వెనక బ్లాక్‌ దందా నడుస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టికెట్ల కోసం క్రికెట్‌ అభిమానులు తిప్పలు పడుతున్నారు. ఉదయం నుంచే ఉప్పల్‌, జింఖాన్‌ గ్రౌండ్స్‌లో క్యూ కట్టారు. ఇప్పటివరకూ కౌంటర్లు ఓపెన్‌ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్ముతారా? లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం కెపాసిటీ 55 వేల సీట్లు. ఇందులో దాదాపు 8 వేల సీట్లు రెన్యువేషన్‌ కాలేదు. బాగుచేయని ఆ 8 వేల సీట్లను కూడా హెచ్‌సీఏ అమ్మకానికి పెట్టింది. అయితే హెచ్‌సీఏ బోర్డుపై టికెట్‌ రేటు ఓ విధంగా ఉంటే.. అమ్ముకునే రేట్ల మధ్య చాలా తేడా ఉంది. కార్పొరేట్‌ బాక్స్‌ రేటు రూ.15 వేలు ఉంటే.. లక్షల్లో అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

38 వేల టికెట్ల అమ్మకాలపై కూడా గందరగోళం నెలకొని ఉంది. రూ. 850 నుంచి రూ. 10 వేల వరకూ ఈ టికెట్లను అమ్ముతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 15న పేటీఎం యాప్‌లో టికెట్లు ఇలా పెట్టారో లేదో.. అలా ఆల్ టికెట్స్ సోల్డ్ అవుట్‌గా చూపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకై పోయారు. దీంతో ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో టికెట్ల కోసం వేట మొదలుపెట్టారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు ఇంకా అమ్మకాలు ప్రారంభించలేదు. కానీ, అప్పుడే బ్లాక్‌ దందాపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

25న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. ఆసీస్‌తో మ్యాచ్‌ అంటే అభిమానులకు పండుగలా ఉంటుంది. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్‌ జరుగుతుండడంతో టికెట్ల కోసం అభిమానులు భారీగా క్యూ కడుతున్నారు. అయితే టికెట్లు మాత్రం దొరకడం లేదు. 15 నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంచారు. అయితే అరగంటలోనే అవి టికెట్లు అమ్ముడుపోయినట్లు యాప్‌లో మేసేజ్‌ కనపడింది. దీంతో నిరాశచెందిన క్రికెట్‌ అభిమానులు ఆఫ్‌లైన్‌లో టికెట్ల కోసం ఉప్పల్‌ స్టేడియం గేటు దగ్గర పడిగాపులు కాస్తున్నారు.