AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డ్రైవింగ్‌లో ఇది నెక్స్ట్ లెవల్.. ఈయన టాలెంట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వైరల్ వీడియో..

ఇరుకుగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేయడం అంటే చాలా రిస్క్‌తో కూడుకున్నది. అక్కడ ట్రాఫిక్ లేకపోయినా అసలు డ్రైవింగ్ టెస్ట్ అక్కడే ఉంటుంది.

Viral Video: డ్రైవింగ్‌లో ఇది నెక్స్ట్ లెవల్.. ఈయన టాలెంట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వైరల్ వీడియో..
Amazing Car Driving Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 20, 2022 | 11:29 AM

డ్రైవింగ్‌లో నాకంటే తోపు లేరని చాలామంది అనుకుంటుంటారు. కానీ, తాజాగా నెట్టింట్లో సందడి చేస్తోన్న వీడియోని చూస్తే మాత్రం, ఒకసారి ఆలోచించుకోవాల్సిందే బ్రో అంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇరుకుగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేయడం అంటే చాలా రిస్క్‌తో కూడుకున్నది. అక్కడ ట్రాఫిక్ లేకపోయినా అసలు డ్రైవింగ్ టెస్ట్ అక్కడే ఉంటుంది. ప్రస్తుతం, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులోని వ్యక్తి డ్రైవింగ్ నైపుణ్యం చూస్తే, మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఏముందని ఆలోచిస్తున్నారా.. అయితే, ఈ వీడియో మీరు చూడాల్సిందే.

వైరల్ అవుతున్న వీడియోలో, మైదానం మధ్యలో పెద్ద కాలువ ఉందని వీడియోలో చూడొచ్చు. దానిపై రెండు బరువైన కర్రదిమ్మెలు ఉంచినట్లు గమనించవచ్చు. ఒక వ్యక్తి వాటిపై కారు నడిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. కారును వెనకకు డ్రైవ్ చేయడం. అందుకే ఈ వీడియో చూస్తే మీ కళ్ళు కూడా చెదిరిపోతాయని అన్నాం. ప్రారంభంలో ఈ వ్యక్తి నేరుగా కాలువలోకి వెళ్తాడని మీరు భావించి ఉండొచ్చు. కానీ, చక్కని డ్రైవింగ్ నైపుణ్యాలతో నెటిజన్లనకు పిచ్చెక్కించేశాడు.

ఇవి కూడా చదవండి

వీడియో మీకోసం..

ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. 2 నిమిషాల 18 సెకన్ల వీడియోలో తన అద్భుతమైన డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రదర్శించిన డ్రైవర్‌ను నెటిజన్లు మొచ్చుకుంటున్నారు. ఈ వీడియోకు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 6 వేలకు పైగా లైక్‌లు, 900 రీట్వీట్లు వచ్చాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.