Team India: టీ20ల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌కి హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. 10 ఓవర్లు, 2 మెయిడీన్లు, 6 వికెట్లతో స్ట్రాంగ్ కౌంటర్
Yuzvendra Chahal: కొన్ని నెలలుగా టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకోవడంలో విఫలమవుతున్న ఈ గూగ్లీ స్పిన్నర్.. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో 6 వికెట్లతో మెరిశాడు. దీని ద్వారా మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకునే ప్రయత్నంలో తొలి అడుగు పడింది. ఎంతో కాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తోన్న ఈ స్పిన్నర్‌కు ఈసారైన అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాలి.
ఆస్ట్రేలియాతో టీం ఇండియా(India vs Australia) నేటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఈ టైటిల్ పోరులో తొలి మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సిరీస్ నుంచి టీమిండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు చాలా మందికి విశ్రాంతి ఇవ్వడంతో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. కానీ, జట్టును ప్రకటించగానే బీసీసీఐ కొంత మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపించాయి. అలాంటి వారిలో సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, కొన్ని నెలలుగా టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకోవడంలో విఫలమవుతున్న గూగ్లీ స్పిన్నర్ చాహల్.. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో 6 వికెట్లు తీసి మెరిశాడు. దీని ద్వారా మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకునే ప్రయత్నంలో తొలి అడుగు పడిందని అంతా భావిస్తున్నారు.
6 వికెట్లు పడగొట్టిన చాహల్..
విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా జట్టు తరపున ఆడుతున్న చాహల్ ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యుజువేంద్ర చాహల్ తన 10 ఓవర్లలో 2 మెయిడెన్ ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి, ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లను బౌల్డ్ చేశాడు. దీంతో మరోసారి టీమిండియాలో ఎంపికకు బలమైన కారణం చూపించాడు.
కౌంటీ క్రికెట్‌లోనూ మెరిసిన చాహల్..
టీమ్ ఇండియాలో చాహల్ స్థానం కోల్పోయి చాలా రోజులైంది. వన్డే ప్రపంచకప్‌లో కూడా అతను టీమ్ ఇండియాలో భాగం కాలేదు. దీనికి ముందు యుజువేంద్ర చాహల్‌ను ఆసియా కప్, ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులోనూ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే దీంతో నిరాశ చెందని చాహల్.. మళ్లీ ఫామ్‌ను వెదుక్కునే క్రమంలో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌లోనూ పాల్గొన్నాడు. ఇప్పుడు, దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ఆటను ప్రదర్శించడం ద్వారా మరోసారి భారత జట్టులో చేరాలని చాహల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
టీ20లో అత్యంత విజయవంతమైన బౌలర్..
యుజ్వేంద్ర చాహల్ టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు అత్యంత విజయవంతమైన బౌలర్. భారత్ తరపున 80 టీ20 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో యుజువేంద్ర చాహల్ ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ అత్యుత్తమ గణాంకాలు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చాహల్‌ను జట్టులో అవకాశం దక్కలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..