IND vs AUS 1st T20I Highlights: చివరి వరకు ఉత్కంఠ.. రింకూ స్టైల్ విక్టరీ.. విశాఖ టీ20 భారత్‌దే..
India vs Australia 1st T20I Highlights in Telugu: టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 209 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారుల జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 50 బంతుల్లో 110 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
India vs Australia 1st T20I Highlights in Telugu: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 20వ ఓవర్ చివరి బంతికి 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కంగారూలపై టీ20లో భారత్‌కు ఇదే అతిపెద్ద పరుగుల వేట. అంతకుముందు, 2013లో రాజ్‌కోట్‌లో భారత్ చేసిన 202/4 పరుగుల వేట అత్యంత విజయవంతమైనది. టీమిండియా తరుపున కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 80 పరుగులతో, ఇషాన్ కిషన్ 58 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో రింకూ సింగ్ 14 బంతుల్లో 22 పరుగులు చేసింది.
అంతకుముందు టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 209 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారుల జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది.
జోష్ ఇంగ్లిస్ 50 బంతుల్లో 110 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన T-20 కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లిష్‌తో పాటు స్టీవ్ స్మిత్ 52 పరుగులు చేశాడు. వీరిద్దరూ 66 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
భారత్ తరపున ప్రసీద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. ఒక బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ జరుగుతుంది.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు అన్ని జట్ల దృష్టి టీ20పైనే ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియాపై టీ20లో వరుసగా మూడో విజయం సాధించినట్లవుతుంది. ఆతిథ్య జట్టు ఈ సిరీస్‌ను గెలిస్తే కంగారూ జట్టుపై వరుసగా మూడో సిరీస్ విజయం సాధించినట్లవుతుంది. 2020, 2022లో ఆడిన చివరి రెండు సిరీస్‌లను భారత్ గెలుచుకుంది.
హెడ్ టు హెడ్ రికార్డ్..
ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ-20లో 10 సిరీస్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఐదింటిలో గెలుపొందగా, ఆస్ట్రేలియా రెండింటిలో విజయం సాధించింది. మూడు సిరీస్‌లు డ్రా అయ్యాయి.
పిచ్ రిపోర్ట్..
విశాఖపట్నంలోని పిచ్ బౌలర్లకు ఉపయోగపడుతుంది. స్పిన్నర్లు, పేసర్లు ఇద్దరికీ సహాయకారిగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటి వరకు 3 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. ఛేజింగ్ జట్లు 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి.
గత ఏడాది దక్షిణాఫ్రికాపై భారత్ చేసిన 179 పరుగులే ఇక్కడ అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది. 2016లో భారత్‌పై శ్రీలంక చేసిన 82 పరుగుల అత్యల్ప స్కోరుగా నిలిచింది.
ఇక్కడ టీ-20లో భారత్, ఆస్ట్రేలియా ఒక్కసారి తలపడగా ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్/కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE Cricket Score & Updates
-
తొలి టీ20లో సత్తా చాటిన భారత్..
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 20వ ఓవర్ చివరి బంతికి 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కంగారూలపై టీ20లో భారత్‌కు ఇదే అతిపెద్ద పరుగుల వేట. అంతకుముందు, 2013లో రాజ్‌కోట్‌లో భారత్ చేసిన 202/4 పరుగుల వేట అత్యంత విజయవంతమైనది.
-
తిలక్ ఔట్..
టీమిండియా 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 56, రింకూ సింగ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. సూర్య తన T-20 కెరీర్‌లో 16వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు.
-
-
ఇషాన్ ఔట్..
13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 58 పరుగుల తర్వాత పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సూర్యకుమార్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది.
-
సెంచరీ దాటిన భాగస్వామ్యం..
టీమిండియా 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 48 , కెప్టెన్ సూర్యకుమార్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరి మధ్య 102+ భాగస్వామ్యం ఉంది.
-
100 దాటిన స్కోర్..
టీమిండియా 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 39, కెప్టెన్ సూర్యకుమార్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరి మధ్య 70+ భాగస్వామ్యం ఉంది.
-
-
సూర్య, ఇషాన్ జోడీ దూకుడు..
టీమిండియా 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు.
-
5 ఓవర్లకు భారత్..
5 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. సూర్య, ఇషాన్ క్రీజులో ఉన్నారు.
-
యశస్వి జైస్వాల్ ఔట్..
టీమిండియా 2.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు.
21 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు.
-
గైక్వాడ్ రనౌట్..
టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 209 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఓవర్‌లో ఒక వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు.
రితురాజ్ గైక్వాడ్ ఎలాంటి బంతిని ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు.
-
భారత్ టార్గెట్ 209
విశాఖపట్నంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 209 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
తొలి సెంచరీ చేసి, పెవిలియన్ చేరిన ఇంగ్లీష్..
ఆస్ట్రేలియా 17.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 110 పరుగుల తర్వాత పెవిలియన్ చేరాడు. మార్కస్ స్టోయినిస్ క్రీజులో ఉన్నారు.
జోష్ ఇంగ్లిస్ తొలి సెంచరీ పూర్తి చేశాడు. 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు
-
సెంచరీ దిశగా ఇంగ్లీష్..
ఆస్ట్రేలియా 15 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 151పరుగులు చేసింది. ఇంగ్లీష్ 94, స్మిత్ 42 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
ఇంగ్లీష్ తొలి హాఫ్ సెంచరీ..
ఆస్ట్రేలియా 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీష్ ఉన్నారు. వీరిద్దరి మధ్య హాఫ్ సెంచీర భాగస్వామ్యం నెలకొంది. ఇంగ్లిష్ అతని టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు.
-
50 దాటిన భాగస్వామ్యం..
తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ఆస్ట్రేలియా 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీష్ ఉన్నారు. వీరిద్దరి మధ్య యాభై భాగస్వామ్యం నెలకొంది. ఇంగ్లిష్ అతని టీ20 కెరీర్‌లో తొలి యాభైకి చేరువయ్యాడు.
-
5 ఓవర్లకు ఆసీస్ స్కోర్..
5 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా టీం ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. స్మిత్ 16, ఇంగ్లీష్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
టీమిండియా ప్లేయింగ్ 11లో మార్పులు..
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
View this post on Instagram -
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI..
మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్/కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ.
-
భారత్ ప్లేయింగ్ XI..
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
-
IND vs AUS Live Score: టాస్ గెలిచిన భారత్..
టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
-
వాతావరణం..
నేడు అంటే నవంబర్ 23న విశాఖపట్నంలో వాతావరణం స్పష్టంగా ఉండదు. మార్పులు ప్రబలంగా ఉంటాయి. 60% వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.
-
పిచ్ రిపోర్ట్..
విశాఖపట్నంలోని పిచ్ బౌలర్లకు ఉపయోగపడుతుంది. స్పిన్నర్లు, పేసర్లు ఇద్దరికీ సహాయకారిగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటి వరకు 3 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. ఛేజింగ్ జట్లు 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి.
-
IND vs AUS 1st T20I Live Score: మరికొద్దిసేపట్లో టాస్..
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ జరుగుతుంది.
Published On - Nov 23,2023 6:15 PM