Krunal Pandya: తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా ఆల్‌రౌండర్.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
Krunal Pandya: తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా ఆల్‌రౌండర్.. ముద్దుల కుమారుడిని పరిచయం చేసిన కృనాల్..Cricket: టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా (Krunal Pandya) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి పంకూరి శర్మ (Pankhuri Sharma) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Krunal Pandya: తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా ఆల్‌రౌండర్.. ముద్దుల కుమారుడిని పరిచయం చేసిన కృనాల్..Cricket: టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా (Krunal Pandya) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి పంకూరి శర్మ (Pankhuri Sharma) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కృనాల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన భార్య, బిడ్డలతో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన కృనాల్ తన బిడ్డకు కవిర్ కృనాల్ పాండ్యా అని నామకరణం చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు క్రికెటర్లు, అభిమానులు కృనాల్- పంకూరి శర్మ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. హార్దిక్- స్టాంకోవిచ్ దంపతులు, జహీర్‌ఖాన్ సతీమణి సాగరిక, నటి సోనాల్ చౌహాన్, ఖలీల్ అహ్మద్, మోహసిన్ ఖాన్ తదితరులు వీరికి విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు.
కాగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోదరుడైన కృనాల్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. బ్లూ జెర్సీలో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో (2016-21) ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున ఆడిన ఈ ఆల్‌రౌండర్ గతేడాది సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీతో బరిలోకి దిగాడు. ఇక పంకూరి విషయానికొస్తే.. ఈమె ప్రొఫెషనల్ మోడల్. వీరిది ప్రేమ వివాహం. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన కృనాల్- పంకూరి పెద్దల అనుమతితో 2017 డిసెంబర్ లో పెళ్లిపీటలెక్కారు. వారి ప్రేమ బంధానికి గుర్తింపుగా తాజాగా ముద్దుల కుమారుడిని జీవితంలోకి ఆహ్వానించారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..