IND vs PAK: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. ఆ నలుగురు ఆటగాళ్లకు నో ఛాన్స్.. రోహిత్ ప్లాన్ ఇదే

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనర్లు గా బరిలోకి దిగారు. ప్లేయింగ్ 11లో యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌లకు చోటు దక్కలేదు

IND vs PAK: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. ఆ నలుగురు ఆటగాళ్లకు నో ఛాన్స్.. రోహిత్ ప్లాన్ ఇదే
India Vs Pakistan

Updated on: Jun 06, 2024 | 9:12 AM

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనర్లు గా బరిలోకి దిగారు. ప్లేయింగ్ 11లో యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌లకు చోటు దక్కలేదు. కాబట్టి తర్వాతి మ్యాచ్‌లో కూడా ఇదే తరహా ప్లే 11 ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే భారత్ తదుపరి రెండు మ్యాచ్‌లు ఈ మైదానంలోనే జరగనున్నాయి. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 11 మంది ఆటగాళ్లను జాగ్రత్తగా ఎంపిక చేశారనడంలో సందేహం లేదు. భారత్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఆల్‌రౌండర్లతో నిండినట్లు కనిపిస్తోంది. కఠిన సమయాల్లో నూ బౌలింగ్, బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఈ ఆటగాళ్లకు ఉంది. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ఇద్దరూ బౌలింగ్ చేయడం లేదు. అందుకే వీరిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ భుజాలపై ఉంటుంది. శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ల పాత్రలో కనిపించనున్నారు.

ఇక బౌలింగ్ విషయానికి జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ కీలకం కానున్నారు. కాబట్టి ఈ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లోనూ కొనసాగుతుందనడంలో సందేహం లేదు. భారత్ తదుపరి మ్యాచ్ ఇదే మైదానంలో పాకిస్థాన్‌తో జరగనుంది. ఆదివారం ( జూన్ 9న) ఈ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ ఇదే ప్లేయింగ్ ఎలెవన్ తో బరిలోకి దిగుతాడని క్రీడాభిమానులు అంటున్నారు. అంటే కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్ మరోసారి రిజర్వ్ బెంచ్ కే పరిమితమవుతారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా ప్లేయింగ్ XI (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..