T20 World Cup 2024: టీ20ల కోసం టీమిండియా కొత్త జెర్సీ.. ఆవిష్కరించిన రోహిత్, జైషా.. వీడియో చూశారా?

|

May 13, 2024 | 6:46 PM

ఐపీఎల్ 2024 టోర్నీ తుది దశకు చేరుకుంది. ఇప్పుడు అందరి దృష్టి టీ20 ప్రపంచకప్ టోర్నీ పైనే ఉంది. 11 ఏళ్లుగా భారత జట్టు ఒక్క ఐసీసీ కప్ కూడా గెలవలేదు. 2013లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో చివరిసారిగా ఐసీసీ కప్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు భారత జట్టు ఐసీసీ ట్రోఫీ అందుకోలేదు.

T20 World Cup 2024: టీ20ల కోసం టీమిండియా కొత్త జెర్సీ.. ఆవిష్కరించిన రోహిత్, జైషా.. వీడియో చూశారా?
Team India's New Jersey
Follow us on

ఐపీఎల్ 2024 టోర్నీ తుది దశకు చేరుకుంది. ఇప్పుడు అందరి దృష్టి టీ20 ప్రపంచకప్ టోర్నీ పైనే ఉంది. 11 ఏళ్లుగా భారత జట్టు ఒక్క ఐసీసీ కప్ కూడా గెలవలేదు. 2013లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో చివరిసారిగా ఐసీసీ కప్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు భారత జట్టు ఐసీసీ ట్రోఫీ అందుకోలేదు. ఇక 2023 వన్డే వరల్డ్ కఫ్ ఫైనల్ లో ఓటమిని ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్పుడు మరోసారి టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ టోర్నీకి సంబంధించి టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. ఇందులో రోహిత్ శర్మ కొత్త జెర్సీతో ఫోటో షూట్ చేస్తున్నాడు. ఆయన వెంట బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఉన్నారు. అయితే ఈ జెర్సీని టీ20 ప్రపంచకప్‌కు టీమ్‌ఇండియా ఉపయోగించలేదు. ఇందులో రెండు మార్పులు చేయాల్సి ఉంది. అయితే ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతం విడుదల చేసిన జెర్సీలో రెండు మార్పులు ఉన్నాయి. టీమ్ ఇండియా జెర్సీని డ్రీమ్ XI స్పాన్సర్ చేసింది. ఈ పేరు జెర్సీ మధ్యలో ముద్రించారు. దీనికి కిట్ స్పాన్సర్ అడిడాస్ లోగో కూడా ఉంది. ఐసీసీ టోర్నీలో జెర్సీ ముందు భాగంలో దేశం పేరు రాయాల్సి ఉంటుంది. దీనికి ఐసీసీ లోగో కూడా ఉంది. దీని కోసం, టీమ్ ఇండియా కొత్త జెర్సీపై స్పాన్సర్ డ్రీమ్ XI, అడిడాస్ లోగోను వేరే చోట ముద్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జెర్సీని టీ20 సిరీస్‌లో భారత జట్టు ధరించనుంది.

 

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి మ్యాచ్ జూన్ 5న జరగనుంది. ఐర్లాండ్ జట్టుతో భారత్ పోరాడనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్థాన్‌తో హైవోల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే జరగనున్నాయి. మరోవైపు వెస్టిండీస్‌లో సూపర్ 8 రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 29న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా ప్రస్తుత జెర్సీని ధరించనుంది.

వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..