Watch Video: న్యూజిలాండ్ టీం ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే, టీమిండియా పరిస్థితి ఏంటీ? నవ్వులు పూయిస్తోన్న రవీంద్ర జడేజా ఆన్సర్

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో భారత్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.

Watch Video: న్యూజిలాండ్ టీం ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే, టీమిండియా పరిస్థితి ఏంటీ? నవ్వులు పూయిస్తోన్న రవీంద్ర జడేజా ఆన్సర్
T20 World Cup 2021, Ravindra Jadeja
Follow us
Venkata Chari

|

Updated on: Nov 06, 2021 | 9:19 AM

T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ 2021లో సెమీ-ఫైనల్ టిక్కెట్ కోసం కోహ్లీసేన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచుపై ఆధారపడింది. ప్రస్తుతం టీమ్ ఇండియా చేతిలో ఉన్న నెట రన్ రేట్ పనిని పూర్తి చేసంది. ఇక ఆశలన్నీ నవంబర్ 7న న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్‌పైనే నిలిపింది. భారత్‌ ఆసక్తి దృష్ట్యా ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ గెలవడం తప్పనిసరి. కానీ, ఇది జరగకపోతే, సమీకరణం ఎలా ఉంటుంది? దీనిపై స్కాట్లాండ్‌పై విజయం సాధించిన రవీంద్ర జడేజా సరదా సమాధానమిచ్చాడు.

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో భారత్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. జడేజా ప్రదర్శనలో టీమ్ ఇండియాకు స్కాట్లాండ్ మ్యాచులో ఘన విజయం సాధిచింది. దీంతో భారత్ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా రన్ రేట్ పడిపోయిన గ్రాఫ్‌ను సరిదిద్దుకుంది. జడేజా అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

న్యూజిలాండ్ టీంను ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే?.. అటువంటి పరిస్థితిలో జడేజా మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశానికి హాజరైనప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించగలదా? ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై జడేజా మాట్లాడుతూ.. ‘ఏం జరుగుతుంది.. బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్తాం’ అని నవ్వించాడు. ఇలా చెప్పి జడేజా నవ్వడం ప్రారంభించాడు. జడేజా సమాధానం విన్న పాత్రికేయులు కూడా నవ్వేశారు.

ఓడిపోవడం చాలా కష్టం: జడేజా “మేం మంచి క్రికెట్ ఆడాలని చూస్తున్నాం. మనం భారీ మెజార్టీతో గెలవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఇందుకోసం మా వంతు కృషి చేస్తున్నాం. జట్టు మొత్తం 100 శాతం మైదానంలో ఆడుతోంది. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. మనం ఇలాగే ఆడితే ఏ జట్టు కూడా మనల్ని ఓడించదు’ అని తెలిపాడు. భారత్‌కు 86 పరుగుల విజయలక్ష్యాన్ని స్కాట్లాండ్ నిర్దేశించగా, 6.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో గ్రూప్‌లో భారత్‌ రన్‌రేట్‌ అత్యుత్తమంగా మారింది.

Also Read: NZ vs AFG: నవంబర్ 7న తేలనున్న భారత భవితవ్యం.. ఆఫ్ఘన్ భారీ తేడాతో గెలిచినా కష‌్టమే.. గ్రూపు 2 సెమీస్ లెక్కలు ఎలా ఉన్నాయంటే?

AUS vs WI, T20 World Cup 2021: ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ టిక్కెట్‌లో అదిరిపోయే ట్విస్ట్.. అదేంటంటే?