IND vs NZ: గేర్ మార్చిన కోహ్లీసేనపై పేలుతోన్న సెటైర్లు.. మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే, ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారా.. ఆగ్రహిస్తోన్న ఫ్యాన్స్..!
న్యూజిలాండ్‌పై పొరపాటు చేస్తే సెమీ-ఫైనల్ రేసులో భారత్ వెనుకబడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగనుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు భారత జట్టు ఆటగాళ్లు సాధన ముమ్మరం చేశారు.
T20 World Cup 2021, IND VS NZ: 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఓటమితో ప్రారంభించింది. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్‌పై ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోని రికార్డు ఈ మ్యాచుతో బద్ధలయింది. ఆరంభం పేలవంగానే ఉంది. కానీ, ప్రస్తుతం టీమిండియా నుంచి పునరాగమనంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఐసీసీ ఈవెంట్లలో విరాట్ అండ్ కోపై మంచి రికార్డును కలిగి ఉన్న న్యూజిలాండ్ జట్టు ముందు ఉన్నందున భారత్ తదుపరి మ్యాచ్ కూడా చాలా కఠినమైనది. న్యూజిలాండ్‌పై పొరపాటు చేస్తే సెమీ-ఫైనల్ రేసులో భారత్ వెనుకబడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగనుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు భారత జట్టు ఆటగాళ్లు సాధన ముమ్మరం చేశారు.
దుబాయ్‌లోని బీచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు వాలీబాల్ ఆడుతున్న వీడియోను బీసీసీఐ శుక్రవారం షేర్ చేసింది. ఆటగాళ్లందరూ చాలా సేపు వాలీబాల్ ఆడారు. దీని ద్వారా ఆటగాళ్ల వ్యాయామం కూడా సరదాగా జరిగింది. భారత జట్టు వాలీబాల్ ప్రాక్టీస్ అభిమానులకు నచ్చడం లేదు. తొలి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ అభిమాని, టీమ్ ఇండియా ఓ ఎగ్జామ్ రాస్తుందనుకుంటే.. ఆ ఎగ్జామ్ మ్యాథ్స్ అయితే.. మన ఆటగాళ్లు మాత్రం ఇంగ్లీష్ చదువుతున్నారు అని వ్యాఖ్యానించాడు. అయితే, క్రీడాకారులు చాలా కాలంగా బయో బబుల్‌లో ఉన్నారని, అలాంటి సెషన్‌లు వారికి మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి ఉద్దేశించినవని అభిమానులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
నెట్స్‌లో టీమ్ ఇండియా ఆటగాళ్లకు చెమటలు.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ కోసం భారత జట్టు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోందని మీకు తెలియజేద్దాం. విరాట్ కోహ్లి భారీ షాట్లు కొట్టేందుకు ప్రాక్టీస్ చేస్తుండగా, ఫాస్ట్ బౌలర్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే, ఈ ఆటగాడు ఇంకా న్యూజిలాండ్‌తో ఆడతాడా లేదా అనేది తెలియదు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తేనే అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పాండ్యాకు జట్టులో చోటు దక్కదు. బౌలింగ్‌కు పాండ్యా ఎంత ఫిట్‌గా ఉంటాడనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఈ ఆటగాడు ఫిట్‌గా ఉంటేనే టీమిండియా బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది.
A game of beach volleyball as #TeamIndia unwinds in their day off! ? ?#T20WorldCup pic.twitter.com/3JXOL17Rr3
— BCCI (@BCCI) October 29, 2021