AFG vs PAK Match Highlights: టీ20లో పాక్ హ్యాట్రిక్ విజయం.. ఆఫ్గనిస్తాన్‌పై గ్రాండ్ విక్టరీ..
AFG vs PAK Live Score in Telugu: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ టీం ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
AFG vs PAK, T20 World Cup 2021: దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాక్ బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరును కనబరచడంతో పాక్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆఫ్గనిస్తాన్ ఇచ్చిన 148 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. పాక్ బ్యాట్స్‌మెన్స్‌లో బాబార్ అజమ్ 51 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాక్‌ను విజయ తీరాలకు చేర్చాడు. ఇక జమాన్ కూడా 25 బంతుల్లో 30 పరుగులు సాధించి స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. చివరిలో వచ్చిన అసిఫ్ అలీ కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్‌ను విజయ తీరాలకు చేర్చాడు. సిక్స్‌తో ఇన్నింగ్ షాట్‌ను బాది పాక్‌ను విజయాన్ని అందించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021లో, గ్రూప్ దశలోని 24వ మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ (AFG vs PAK) పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. టోర్నమెంట్‌లోని సూపర్-12 రౌండ్‌లో, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ పోరుపై గ్రూప్-2లోని ఈ రెండు జట్లు మిగతా గ్రూప్ జట్లపై కన్నేశాయి. ముఖ్యంగా భారత్, న్యూజిలాండ్‌లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. ప్రస్తుతం పాకిస్థాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆ జట్టు మొదటి రెండు మ్యాచ్‌లలోనే భారత్, న్యూజిలాండ్‌లను ఓడించింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో, ఆఫ్గనిస్తాన్ ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ ఆడింది. అందులో కూడా స్కాట్లాండ్‌ను ఓడించింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంటుంది. అదే సమయంలో ఒక విజయంతో పాకిస్థాన్ సెమీ ఫైనల్స్‌లో చేరడం దాదాపు ఖాయంగా మారింది.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
ఆఫ్గనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్
LIVE Cricket Score & Updates
-
పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ..
ఆఘ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సంచలన విజయం నమోదు చేసుకుంది. 5 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఇంక ఓవర్ మిగిలి ఉండగానే ఆఫ్గనిస్తాన్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించింది.
-
వరుసగా రెండు వికెట్‌లు కోల్పోయిన పాకిస్తాన్..
హాఫ్ సెంచరీతో పాకిస్తాన్ స్కోర్ బోర్డును పెంచిన బాబర్ అజమ్ అవుట్ అయ్యాడు. 51 పరుగులు చేసిన అజమ్ రాశీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. బాబర్ అవుట్ అయిన ఓవర్‌లోనే షోయబ్ మాలిక్ కూడా అవుట్ అయ్యాడు. ఉల్‌హక్ వేసిన బంతిలో షాట్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 18 ఓవర్‌లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు సాధించింది. పాక్ విజయానికి 12 పరుగుల్లో 24 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
మూడో వికెట్ కోల్పోయిన పాక్..
పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. రష్‌హిద్ ఖాన్ వేసిన బంతికి షాట్ ఆడడానికి ప్రయత్నించిన మహమ్మద్ హఫీజ్.. గుల్‌బదిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం పాకిస్తాన్ విజయం సాధించాలంటే 28 బంతుల్లో 45 పరుగులు చేయాల్సి ఉంది.
-
రెండో వికెట్ కోల్పోయిన పాక్..
ఆఫ్గానిస్తాన్ ఇచ్చిన 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. నబీ బౌలింగ్‌లో జమాన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 25 బంతుల్లో 30 పరుగులు చేసిన జమాన్ పాకిస్తాన్ స్కోర్ బోర్డ్ పెరగడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 12 ఓవర్‌లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 81 పరుగుల వద్ద కొనసాగుతోంది. పాక్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది.
-
10 ఓవర్లకు..
10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం 1 వికెట్ కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ 35, జమాన్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
-
6 ఓవర్లకు..
6 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం 1 వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది. క్రీజులో ఫఖర్ జమాన్ 20, బాబర్ అజం 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి వికెట్ డౌన్..
ఆఫ్గనిస్తాన్ టీం పాకిస్తాన్‌కు మూడో ఓవర్లోనే షాకిచ్చింది. సూపర్ ఫాంలో ఉన్న రిజ్వాన్(8)ను త్వరగానే పెవిలియన్ చేర్చి ఆశ్చర్యానికి గురిచేసింది. ముజీబ్ బౌలింగ్‌లో రిజ్వాన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి నవీన్ హల్ హక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
పాక్ టార్గెట్ 148
ఆఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ టీం ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో పాకిస్తాన్ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
-
20 ఓవర్లకు..
20 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గనిస్తాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. మహ్మద్ నబీ 35, నైబ్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చివరి ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి.
-
19 ఓవర్లకు..
19 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గనిస్తాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ నబీ 32, నైబ్ 33 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్లో వీరిద్దరూ బౌండరీలతో పాక్ బౌలర్లపై దుమ్మురేపారు. మొత్తం 15 పరుగులు రాబట్టారు.
-
18 ఓవర్లకు..
18 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గనిస్తాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ నబీ 22, నైబ్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్లో నైబ్ దుమ్మురేపాడు. హసన్ అలీని చీల్చి చెండాడాడు. 6, 4, 2,2,4, తో మొత్తం 21 పరుగులు రాబట్టాడు.
-
17 ఓవర్లకు..
17 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గనిస్తాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ నబీ 21, నైబ్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
16 ఓవర్లకు..
16 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గనిస్తాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ నబీ 20, నైబ్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
14 ఓవర్లకు..
14 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గనిస్తాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ నబీ 14, నైబ్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
6 ఓవర్లకు..
6 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గనిస్తాన్ టీం 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. క్రీజులో జర్దాన్ 4, కరీం జనత్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మూడు ఓవర్లకు..
మూడు ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గనిస్తాన్ టీం 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది. క్రీజులో అస్గర్ 0, రహ్మునుల్లా 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
టాస్ గెలిచిన ఆఫ్గాన్..
ఈ మ్యాచులో ఆఫ్గనిస్తాన్ టీం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ టీం మొదట బౌలింగ్ చేయనుంది.
-
ప్లేయింగ్ XI
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
ఆఫ్గనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్
-
PAK vs AFG Live: హెడ్ టు హెడ్ రికార్డ్
పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో రికార్డుల పరంగా చూడడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఫార్మాట్‌లో ఒకే ఒక్కసారి మాత్రమే రెండు జట్లు తలపడ్డాయి. ఆ పోటీలో పాకిస్తాన్ విజయం సాధించింది. అదే సమయంలో టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి.
Published On - Oct 29,2021 7:02 PM