T20 World Cup 2021: 6 ఏళ్లు, 5 టోర్నమెంట్లు, 4 ఫైనల్స్.. తగ్గేదెలే అంటోన్న కివీస్ సారథి.. ఏ కెప్టెన్‌కూ ఈ రికార్డులు సాధ్యం కాలే..!

Kane Williamson: ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి పోటీదారుల లిస్టులో లేనే లేదు. కానీ, కెప్టెన్ విలియమ్సన్ జట్టును ఫైనల్స్‌కు నడిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

T20 World Cup 2021: 6 ఏళ్లు, 5 టోర్నమెంట్లు, 4 ఫైనల్స్.. తగ్గేదెలే అంటోన్న కివీస్ సారథి.. ఏ కెప్టెన్‌కూ ఈ రికార్డులు సాధ్యం కాలే..!
T20 World Cup 2021 New Zealand Kane Williamson
Follow us

|

Updated on: Nov 11, 2021 | 8:30 AM

T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ 2021 (ICC T20 World Cup 2021) ప్రారంభానికి ముందు, టోర్నమెంట్‌లో టైటిల్ కోసం అతిపెద్ద పోటీదారులుగా పరిగణించబడిన మూడు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. భారత్, వెస్టిండీస్ గ్రూప్ దశలోనే వెనుదిరగాయి. అయితే ప్రపంచ కప్‌లో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా పరిగణించబడుతున్న ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్ జట్టు సెమీ-ఫైనల్స్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. తమాషా ఏంటంటే.. సెమీఫైనల్ వరకు ఎవరూ ఊహించని, తొలి గ్రూప్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఫైనల్‌కు చేరింది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఈ జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడమే కాకుండా ఏ కెప్టెన్ చేయలేని పనిని కూడా కేవలం మూడేళ్లలోనే సాధించాడు.

2015లో బ్రెండన్ మెకల్లమ్ సారథ్యంలో తొలిసారిగా ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ జట్టు ఆ తర్వాత అద్భుత ప్రదర్శన చేస్తూ ఐసీసీ టోర్నీల్లో నిలకడైన రికార్డును కొనసాగిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాయకత్వంలో, న్యూజిలాండ్ గత 3 సంవత్సరాలలో ఇలాంటి పని చేసింది. విలియమ్సన్ దరిదాపుల్లో కూడా ఏ కెప్టెన్ లేకపోవడం విశేషం.

విలియమ్సన్ ప్రత్యేక విజయం.. విలియమ్సన్ న్యూజిలాండ్‌ టీంకు ఈ ప్రత్యేక విజయాన్ని అందించాడు. ఇటీవలి ఐసీసీ టోర్నమెంట్‌లలో జట్టు ప్రదర్శన గురించి మాట్లాడితే.. న్యూజిలాండ్ వరుసగా మూడో ఐసీసీ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుంది. మూడేళ్లలో మూడో ఫైనల్. న్యూజిలాండ్‌ మినహా మరే ఇతర జట్టు కూడా ఈ ఘనత సాధించలేకపోయింది.

మూడు ఫార్మాట్ల ఐసీసీ టోర్నీల్లో తన జట్టును ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ నిలిచాడు.

2019 వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది జూన్ 2021లో, న్యూజిలాండ్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ అది టైటిల్‌ను గెలుచుకోవడానికి భారతదేశాన్ని ఓడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కివీ జట్టు మొదటిసారిగా పొట్టి ఫార్మాట్‌లో ఫైనల్‌కు చేరుకుంది.

6 సంవత్సరాలు, 5 టోర్నమెంట్లు, 4 ఫైనల్స్.. గత 6 ఏళ్లలో ఐసీసీ ఆడిన ఐదు టోర్నీల్లో కివీ జట్టు నాలుగో టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. 2016 టీ20 ప్రపంచకప్‌లో మాత్రమే, జట్టు ఫైనల్‌కు దూరమైంది. ఆ తర్వాత సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విధంగా ఈ విజయంతో న్యూజిలాండ్ 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్, 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకుంది.

Also Read: PAK vs AUS, ‌Head To Head: రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ పోరు.. న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడేది ఎవరో?

Babar Azam vs Virat Kohli: ఒకరేమో చంద్రుడు.. మరొకరేమో సూర్యుడు.. విరాట్-బాబర్‌ల పోలికపై పాక్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!

Latest Articles