T20 World Cup 2021, PAK vs SCO: ఛాంపియన్ కావాలంటే స్కాట్లాండ్‌పై పాక్ ఓడాల్సిందే.. ఎందుకో తెలుసా?
పాకిస్తాన్ నవంబర్ 14న ట్రోఫీని దక్కించుకోవాలంటే మాత్రం ఈరోజు స్కాట్లాండ్‌పై గెలవాలనే కోరికను వదులుకోవాల్సి వస్తుంది. చరిత్ర ఏం చెబుతోందంటే?
T20 World Cup 2021, PAK vs SCO: టీ20 ప్రపంచకప్2021లో పాకిస్తాన్ వరుస విజయాలతో దూసుకపోతోంది. కానీ, ఈరోజు తన విజయం రథ యాత్రను వదులుకోవాల్సి వచ్చింది. నవంబర్ 14న జరిగే ఫైనల్లో గెలవాలంటే.. ఈరోజు స్కాట్లాండ్‌పై గెలవాలనే కోరికను వదులుకోవాల్సి వస్తుంది. రెండోసారి టీ20 వరల్డ్‌కప్‌లో ప్రపంచ విజేతగా పేరు తెచ్చుకోవాలంటే.. ఈరోజు మ్యాచ్‌లో ఓడిపోవడానికే ఆడాలి. అదేంటి.. పోయి పోయి స్కాట్లాండ్‌తో పాకిస్తాన్ ఎందుకు ఓడిపోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఇందుకు ఒక కారణం కూడా ఉంది. టీ20 చరిత్ర చూస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా పాకిస్థాన్ జట్టు నిలిచింది. అయితే సెమీ ఫైనల్‌కు చేరుకోవడం అంటే టైటిల్‌ను కైవసం చేసుకోవడం కాదు. ఇక సెమీఫైనల్‌కు చేరిన తర్వాత ఓడిపోవడమనేది ఏ జట్టుకైనా తీవ్రమైన బాధే కలిగిస్తుంది. అందువల్ల, ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చాంపియన్‌గా నిలవాలంటే, అది ఓడిపోవాల్సిందే. ఓడిపోయే అవకాశం నేటి మ్యాచ్‌లో మాత్రమే ఉంది. ఎందుకంటే సెమీ-ఫైనల్ లేదా టోర్నమెంట్‌లో పురోగతి సాధించాలంటే లీగ్ దశలో కచ్చితంగా ఓసారైనా ఓడిపోవాలని టీ20 చరిత్ర చెబుతోంది.
ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో జట్లు ఛాంపియన్‌లుగా మారాలంటే మాత్రం టీ20 చరిత్రలో ఓ శకునం ఉంది. వాస్తవానికి, ఇప్పటివరకు పొట్టి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న జట్లన్నీ టోర్నమెంట్‌లో కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఓడిపోయాయి. అయితే 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈరోజు స్కాట్లాండ్‌ను ఓడించి, వారు అజేయంగా వెళ్లి సెమీ-ఫైనల్‌కు చేరుకుంటారు. మరి అలా చేస్తే టైటిల్ కి దూరం అవుతారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పేలుతున్నాయి. అందుకే ఈరోజు స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెమీఫైనల్‌కు ముందు ఓడిపోవడం చాలా ముఖ్యం.
స్కాట్లాండ్‌ను ఓడిస్తేనే పాకిస్థాన్ ఛాంపియన్..! గ్రూప్ దశలో పాకిస్థాన్ జట్టుకి ఇదే చివరి మ్యాచ్. అంటే ఓడిపోవడానికి చివరి అవకాశం. ఇంతకు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. భారత్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, నమీబియాలను ఓడించింది. ఈరోజు స్కాట్లాండ్‌తో తలపడుతున్నారు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో పాక్ టీంకు 3-0 రికార్డు ఉంది. కానీ, తన సొంత ప్రయోజనాల దృష్ట్యా, రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలవాలంటే ఈరోజు స్కాట్‌లాండ్‌పై తన టీ20 రికార్డును 3-1తో చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం చరిత్ర గెలుస్తుందో.. లేదా పాక్ టీం సరికొత్త చరిత్రను లిఖిస్తుందో?
Also Read: T20 World Cup: వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో ఆ జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిందే.. ఎందుకంటే..
NZ vs AFG Live Score, T20 World Cup 2021: టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?