NZ vs AFG Highlights, T20 World Cup 2021: భారత్‌కు హ్యాండిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. 8 వికెట్ల తేడాతో ఓటమి.. సెమీఫైనల్ చేరిన కివీస్
NZ vs AFG Highlights in Telugu: స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుని ఘన విజయం సాధించింది. అయితే నెట్ రనే రేట్ అవసరం లేకుండానే విలియమ్సన్ సేన సెమీఫైనల్ చేరింది.
NZ vs AFG Highlights, T20 World Cup 2021: న్యూజిలాండ్ విజయంతో భారత్ సెమీఫైనల్ ఆశలకు తెరపడింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుని ఘన విజయం సాధించింది. అయితే నెట్ రనే రేట్ అవసరం లేకుండానే విలియమ్సన్ సేన సెమీఫైనల్ చేరింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఏ మాత్రం కలిసి రాలేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో మునిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసింది. ఇందులో నజీబుల్లా జద్రాన్ 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లో కేవలం ఇద్దరే రెండెంకల స్కోర్ దాటారు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ 2, ట్రెంట్ బౌల్ట్ 3, మిల్నే, నీషమ్, సోధి తలో వికెట్ పడగొట్టారు.
టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్‌కు వెళ్లే రెండో జట్టు ఏది అనేది ఈ రోజు ఈ మ్యాచ్ తర్వాత తేలనుంది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు భారత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. న్యూజిలాండ్ విజయంతో భారత్ సెమీఫైనల్ ఆశలకు తెరపడనుంది.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(w), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ(సి), కరీం జనత్, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్
LIVE Cricket Score & Updates
-
న్యూజిలాండ్ ఘన విజయం
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుని ఘన విజయం సాధించింది. అయితే నెట్ రనే రేట్ అవసరం లేకుండానే విలియమ్సన్ సేన సెమీఫైనల్ చేరింది.
-
14 ఓవర్లకు..
14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం రెండు వికెట్లు కోల్పోయి 91 పరుగులు సాధించింది. క్రీజులో కేన్ విలియమ్సన్ 27, డెవాన్ కాన్వే 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
-
టీ20 కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
మార్టిన్ గప్టిల్ వికెట్‌తో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ టీ20ల్లో 40 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 553 డ్వేన్ బ్రావో 425 సునీల్ నరైన్ 420 ఇమ్రాన్ తాహిర్ 400 రషీద్ ఖాన్ 398 షకీబ్ అల్ హసన్ రషీద్ టీ20 అరంగేట్రం చేసినప్పటి నుంచి మరే ఇతర బౌలర్ కూడా ఈ ఫార్మాట్‌లో 300 వికెట్లు కూడా తీయలేదు.
-
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..
మార్టిన్ గప్టిల్ (28 పరుగుల, 23 బంతులు, 4 ఫోర్లు) రూపంలో న్యూజిలాండ్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. రషీద్ బౌలింగ్‌లో గప్టిల్ బౌల్డయ్యాడు. న్యూజిలాండ్ సెమీస్ చేరాలంటే మరో 66 పరుగులు చేస్తే చాలు.
-
7 ఓవర్లకు..
7 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు సాధించింది. క్రీజులో కేన్ విలియమ్సన్ 8, మార్టిన్ గప్టిల్ 27 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
-
తొలి వికెట్ డౌన్..
డారిల్ మిచెల్ (17 పరుగుల, 12 బంతులు, 3 ఫోర్లు) రూపంలో న్యూజిలాండ్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ముజీబ్ అద్భుత బంతికి షాజాద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే..
ఆఫ్ఘనిస్తాన్ టీం న్యూజిలాండ్‌ను 81 లేదా అంతకంటే తక్కువ పరుగులకే పరిమితం చేయాలి. అప్పుడే రన్ రేట్‌లో ముందుంటుంది.
-
ఏడో వికెట్ డౌన్..
ఇన్నింగ్స్ 18.4వ ఓవర్‌లో కరీం (2) పెవిలియన్ చేరాడు. బౌల్ట్ వేసిన బంతిని ఇష్ సోధి క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.
-
ఐదో వికెట్ డౌన్..
ఇన్నింగ్స్ 17.6వ ఓవర్‌లో చివరి బంతికే నబీ (14) పెవిలియన్ చేరాడు. సౌతీ వేసిన బంతిని అతనే క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.
-
15 ఓవర్లకు..
15 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్తాన్ టీం 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు సాధించింది. క్రీజులో నజీబుల్లా జద్రాన్ 50, మహ్మద్ నబీ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
పది ఓవర్లకు..
10 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్తాన్ టీం 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు సాధించింది. క్రీజులో నజీబుల్లా జద్రాన్ 27 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
-
మూడో వికెట్ డౌన్..
ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో తొలి బంతికే రహ్మానుల్లా గుర్బాజ్(6) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. సౌతీ వేసిన బంతి ఫఉల్ ఆన్ ఆఫ్ బాల్ ప్యాడ్‌కు తగలడంతో ఎల్బీగా ఔటయ్యాడు.
-
రెండో వికెట్ పడగొట్టిన ట్రెంట్ బౌల్ట్..
ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో తొలి బంతికే హజ్రతుల్లా జజాయ్(2) పెవిలియన్ చేరాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతి మికెట్ మీదుగా గాల్లోకి లేవడంతో సాంట్నర్ సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు.
-
తొలి వికెట్ పడగొట్టిన మిల్నే..
ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో రెండో బంతికే మహ్మద్ షాజాద్(4) పెవిలియన్ చేరాడు. మిల్నే వేసిన షార్ట్ పించ్ బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
-
ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ XI
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ(కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్
-
న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ల సవాల్..
ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు న్యూజిలాండ్ ఆటను చెడగొట్టడానికి రెండు కారణాలున్నాయి. ముందుగా ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. రెండవది, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ ఇప్పటివరకు స్పిన్‌కు వ్యతిరేకంగా వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. మార్టిన్ గప్టిల్ మినహా, ప్రతీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఈ ప్రపంచ కప్‌లో స్పిన్‌పై స్ట్రైక్ రేట్ 111 లేదా అంతకంటే తక్కువగా ఉంది.
-
టీ20లో తొలిసారి ఇరు జట్లు ముఖాముఖి పోరు..
ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు టీ20 మ్యాచ్ జరగలేదు. ఇదే తొలి మ్యాచ్. ఆఫ్ఘనిస్థాన్ టీం పాకిస్థాన్‌ను చివరి ఓవర్ వరకు కంగారు పెట్టిన తీరును న్యూజిలాండ్ తేలిగ్గా తీసుకోదనడంలో సందేహం లేదు.
-
ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకం..
ఈ మ్యాచ్‌పైనే టీమ్‌ఇండియా అభిమానుల చూపు నిలువనుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే భారత్ సెమీఫైనల్‌కు తలుపులు తెరుచుకున్నట్లే. మరోవైపు న్యూజిలాండ్ జట్టు గెలిస్తే భారత్ స్వదేశానికి బయలుదేరనుంది.
-
ఆఫ్ఘనిస్థాన్ vs న్యూజిలాండ్..
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్‌తో అఫ్గానిస్థాన్ తలపడనుంది. సెకండ్ గ్రూప్ నుంచి సెమీఫైనల్ చేరే జట్టు ఏదో ఈ మ్యాచ్‌పైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే ఈ గ్రూపు నుంచి పాకిస్తాన్ టీం సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా మారింది.
Published On - Nov 07,2021 2:56 PM