T20 World Cup 2021: వారిద్దరు మ్యాచ్‎ను మలుపు తిప్పారు.. ఆస్ట్రేలియాపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు..

టీ20 వరల్డ్ కప్‎లో గురువారం జరిగిన సెమీస్‎లో పాకిస్తాన్‎పై ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‎లోకి దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా నవంబరు 14న న్యూజిలాండ్‎తో ఫైనల్‎లో తలపడనుంది...

T20 World Cup 2021: వారిద్దరు మ్యాచ్‎ను మలుపు తిప్పారు.. ఆస్ట్రేలియాపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు..
Ausis
Follow us

|

Updated on: Nov 12, 2021 | 3:25 PM

టీ20 వరల్డ్ కప్‎లో గురువారం జరిగిన సెమీస్‎లో పాకిస్తాన్‎పై ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‎లోకి దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా నవంబరు 14న న్యూజిలాండ్‎తో ఫైనల్‎లో తలపడనుంది. ఈ మ్యాచ్‎లో ఆసీసీ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ అద్భుతంగా రాణించి జట్టును గెలిపించారు. దీంతో ఆస్ట్రేలియాపై పలు దేశాల మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెమీస్ చాలా రసవత్తరంగా సాగిందిని దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన టెండూల్కర్ అన్నారు. చివరి ఐదు ఓవర్లులో ఆస్ట్రేలియా పుంజుకున్న తీరు అద్భుతమని ట్వీట్ చేశారు.

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసీస్‎ను అభినందించారు. కీలక క్యాచ్ మిస్ చేయడం వల్ల మ్యాచ్ చేయిజారిపోయే ప్రమాదం ఉందన్నారు. పాకిస్తాన్‎ కూడా బాగా ఆడిందన్నారు. టీ20 వరల్డ్ కప్‎లో పాకిస్తాన్ అద్భుతంగా ఆడిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నారు. బాబర్ అజం నేతృత్వంలోని పాకిస్తాన్‌ను ప్రశంసించారు. “మీరు గొప్ప ఆడారు. మీకు ధన్యవాదాలు, మీరు పోరాడిన తీరు మాకు గర్వకారణం. వెల్ డన్ బాయ్స్” అని రాజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వావ్ ఆస్ట్రేలియా వావ్ అంటూ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. మాథ్యు వేడ్ చాలా బాగా ఆడాడని చెప్పాడు.

ఈ మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణిత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. పాక్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వేడ్, మార్కస్ స్టోయినిస్‌తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 6 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించారు. షాహీన్ ఆఫ్రిదిపై 19వ ఓవర్ చివరి 3 బంతుల్లో మూడు వరుస సిక్సర్లు కొట్టిన వేడ్ కేవలం 17 బంతుల్లో 41 పరుగులు చేశాడు. స్టోయినిస్ 40 పరుగులు చేశాడు.

Read Also.. Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!