T20 World Cup 2021: పాపం ఆ బౌలర్‌కి ఈ మ్యాచ్‌ ఒక పీడకల.. అత్యంత చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు..

T20 World Cup 2021: ఆస్ట్రేలియా తొలిసారి టీ 20 ప్రపంచకప్ గెలిచినప్పటకీ ఆ జట్టులోని ఒక ఆటగాడికి మాత్రం ఈ మ్యాచ్ ఒక పీడకల లాంటిది. అతడు ఎవరో కాదు ఆస్ట్రేలియన్

T20 World Cup 2021: పాపం ఆ బౌలర్‌కి ఈ మ్యాచ్‌ ఒక పీడకల.. అత్యంత చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు..
Starc
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 15, 2021 | 1:09 PM

T20 World Cup 2021: ఆస్ట్రేలియా తొలిసారి టీ 20 ప్రపంచకప్ గెలిచినప్పటకీ ఆ జట్టులోని ఒక ఆటగాడికి మాత్రం ఈ మ్యాచ్ ఒక పీడకల లాంటిది. అతడు ఎవరో కాదు ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. తన కెరీర్‌లో ఈ మ్యాచ్‌ను ఎప్పటికీ మరిచిపోలేడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టార్క్ భారీగా పరుగులిచ్చాడు. టోర్నమెంట్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా చెత్త రికార్డ్‌ మూటగట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో స్టార్క్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 15.00 ఎకానమీ రేటుతో 60 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

అతనికి ముందు T20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడు శ్రీలంక ప్లేయర్‌ లసిత్ మలింగ. అతను వెస్టిండీస్‌తో జరిగిన 2012 ఫైనల్‌లో 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20ల్లో 50కి పైగా పరుగులు ఇవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు 2014లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో 50 పరుగులు దాటాడు. 2014 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగులు ఇచ్చాడు. స్టార్క్ వేసిన నాలుగు ఓవర్లూ ఆస్ట్రేలియాకు భారీ నష్టాన్ని మిగిల్చాయి.

స్టార్క్ తొలి ఓవర్‌లో తొమ్మిది పరుగులు ఇచ్చాడు. దీంతో రెండో ఓవర్‌లో 19 పరుగులు ఇచ్చాడు. స్టార్క్ వేసిన మూడో ఓవర్ అతని అత్యంత ఖరీదైన ఓవర్. అందులో అతను 22 పరుగులు ఇచ్చాడు. అదే సమయంలో అతను చివరి ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చి స్పెల్‌ను ముగించాడు. స్టార్క్‌కు న్యూజిలాండ్‌పై మంచి రికార్డు ఉంది. కానీ ఇలా పరుగులిస్తాడని ఎవరూ ఊహించలేదు. 2015 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున స్టార్క్ 28 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, 2019 ప్రపంచ కప్‌లో అతను ఐదు వికెట్లకు 26 పరుగులు మాత్రమే ఇచ్చిన చరిత్ర ఉంది.

Backache: వెన్నునొప్పితో బాధపడుతున్నారా..! ఒక్కసారి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..

NZ vs AUS, T20 World Cup 2021 Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం..

Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి..