T20 Cricket: ఇదేం బౌలింగ్ రా సామీ.. దెబ్బకు జట్టంతా మటాష్.. టీ20 చరిత్రలోనే చెత్త స్కోర్ ఇదే..
Sydney Thunders: నేడు బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ పేరిట ఓ ఇబ్బందికర రికార్డు నమోదైంది. ఈ జట్టు అడిలైడ్ స్ట్రైకర్స్‌పై కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయింది.

BBL 2022: నేడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్లు పెద్ద చరిత్ర సృష్టించారు. నిజానికి స్ట్రైకర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యల్ప స్కోరుగా నమోదైంది.
ఫాస్ట్ బౌలర్ల విధ్వంసం..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 139 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ తర్వాత ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ చాలా సులువుగా గెలుస్తుందని అందరూ భావించారు. అయితే, ఇలా అస్సలు జరగలేదు. రెండవ ఇన్నింగ్స్‌లో, అడిలైడ్ స్ట్రైకర్స్ ఫాస్ట్ బౌలర్లు హెన్రీ థోర్టన్, బెస్ అగర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మొత్తం సిడ్నీ థండర్ జట్టును కేవలం 15 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫాస్ట్ బౌలర్లిద్దరూ కలిసి 9 వికెట్లు పడగొట్టారు.
T20 ఫార్మాట్‌లో అత్యల్ప స్కోరు..
కేవలం 15 పరుగులకే ఆలౌట్ కావడంతో, సిడ్నీ థండర్స్ తన పేరిట చాలా ఇబ్బందికరమైన రికార్డును సృష్టించింది. నిజానికి టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో, సిడ్నీ థండర్స్ జట్టు మొదటి పవర్‌ప్లే వరకు కూడా నిలవలేకపోయింది. మొత్తం జట్టు కేవలం 5.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది.




టీ20 క్రికెట్‌లో అత్యల్ప స్కోరు..
15 పరుగులు – సిడ్నీ థండర్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్ (2022)
21 పరుగులు – టర్కీ వర్సెస్ చెక్ రిపబ్లిక్ (2019)
26 పరుగులు – లెసోతో వర్సెస్ ఉగాండా (2021)
28 పరుగులు – టర్కీ వర్సెస్ లక్సెంబర్గ్ (2019)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
