Suryakumar Yadav : గోల్డెన్ డక్‌తో మరో ఘోర రికార్డు.. సూర్యకుమార్‌కు తొమ్మిదేళ్ల నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయా?
Suryakumar Yadav : ఐపీఎల్ 2026లో సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమవుతున్నారు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అవ్వడంతో అతని బ్యాటింగ్ యావరేజ్ తొమ్మిదేళ్ల కనిష్టానికి పడిపోయింది. సూర్య వరుసగా విఫలమవుతున్నా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రం అతని వెంటే ఉంది.

Suryakumar Yadav : ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఇప్పుడు ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆదివారం రాయ్‌పూర్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సూర్య గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం అందరినీ షాక్‌కు గురిచేసింది. గత సీజన్‌లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచిన ఆటగాడు, ఇప్పుడు కనీసం రెండంకెల స్కోరు చేయడానికి కూడా తడబడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్‌లో సూర్యకు ఇది రెండో గోల్డెన్ డక్ కావడం గమనార్హం.
హార్దిక్ పాండ్యా గాయపడటంతో జట్టు బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి బంతికే అవుటయ్యాడు. 138 కిలోమీటర్ల వేగంతో వచ్చిన అవుట్ స్వింగర్‌ను డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన సూర్య, ఎడ్జ్ ఇచ్చి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి చిక్కాడు. తన రెండో సంతానం పుట్టిన కారణంగా చిన్న విరామం తీసుకున్న సూర్య, నేరుగా మ్యాచ్‌కు ముందు రోజే జట్టుతో చేరాడు. కానీ ఆ విరామం అతనికి అదృష్టాన్ని తీసుకురాలేదు.
ఈ గోల్డెన్ డక్‌తో సూర్యకుమార్ యాదవ్ సగటు ఐపీఎల్ 2026లో కేవలం 17.73కి పడిపోయింది. ఇది గత తొమ్మిదేళ్లలో అతని అత్యంత పేలవమైన ప్రదర్శన. చివరిసారిగా 2017లో అతను 17.50 సగటుతో పరుగులు చేశాడు. ఇక 2015లో అతని కెరీర్ లోనే అత్యంత తక్కువగా 17.44 సగటు నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌ల్లో సూర్య కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. టి20 ప్రపంచంలో నంబర్ వన్ బ్యాటర్‌గా పేరున్న సూర్య, ఇలాంటి గణాంకాలతో సతమతమవ్వడం విశ్లేషకులను ఆలోచింపజేస్తోంది.
సూర్య వరుసగా విఫలమవుతున్నా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రం అతని వెంటే ఉంది. హెడ్ కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ.. “బ్యాటర్లకు ఇలాంటి గడ్డు కాలం రావడం సహజం. సూర్య ఒక అన్-ఆర్థడాక్స్ ప్లేయర్. గత మూడు నాలుగు ఏళ్లలో అతను మా కోసం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను మళ్ళీ త్వరలోనే తన చిరునవ్వుతో, తనదైన శైలిలో ఫామ్‌లోకి వస్తాడు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఒక మంచి ఇన్నింగ్స్ పడితే సూర్య మళ్ళీ పుంజుకుంటాడని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
